తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ


Fri,October 4, 2019 02:25 AM

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు ప్రతీక బతుకమ్మ పండుగని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆత్మకూరు వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య, నీల కంఠేశ్వరస్వామి దేవాలయంలో స్వర్ణకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శరన్నవరాత్రి వేడుకలకు ఎమ్మెల్యే దంపతులు హాజరయ్యారు. ఏడాదికోసారి వచ్చే దసరా పండుగ, మన బతుకుల్ని ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు. బతుకమ్మ పండుగతో అందరి బాగోగులు కోరి, గౌరమ్మను పూజించుకోవడం మన సంస్కృతిగా పేర్కొన్నారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు, కోలాటం ఆడి ఎమ్మెలే దంపతులు వేడుకల్లో ఉత్సాహం నింపారు. ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఎమ్మెలే దంపతులను అమ్మవారి వస్ర్తాలతో సత్కరించారు. ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక, జెడ్పీటీసీ శివరంజని, మార్కెట్‌యార్డ్ చైర్మన్ లీలావతి, పీఏసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తిలను సహితం సత్కరించారు. స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు గాడి లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే దంపతులను ప్రత్యేకంగా సన్మానించారు. నవరాత్రి వేడుకల నేపథ్యంలో కలుసుకోవడం తియ్యని అనుభూతిగా చిట్టెం సుచరితరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమాల్లో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సింగోటం, శ్రీనివాసులు, రమేశ్‌శెట్టి, యాదగిరి, సత్యనారాయణ, కల్వ రాజయ్య, విజయ్‌కుమార్, గోపి, వేణుగోపాల్, రామలింగయ్య, గట్టు శ్రీను, నరేశ్, నర్సింహాయ్యశెట్టి, స్వర్ణకార సంఘం ప్రతినిధులు బంగారు భాస్కర్, రవి, బాల్‌రాజు, శాంతాచారి, నరేశ్, ప్రకాశ్ తదితరులతో పాటు ఎస్‌ఐ ముత్తయ్య, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...