మహా సంబురం


Thu,October 3, 2019 01:24 AM

-ఘనంగా మహాబతుకమ్మ వేడుకలు
-వేలాదిగా తరలివచ్చిన మహిళలు
-కోలాటాలతో కోలాహలం
-ఆకట్టుకున్న ఆటపాటలు
-కాలుకదిపిన మంత్రి నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, కలెక్టర్, ఎస్పీ
-బహుమతులు అందజేసిన అతిథులు

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా కేం ద్రంలో బుధవారం నిర్వహించిన మహాబతుకమ్మ జనసంద్రమైంది. 14 మండలాల నుంచి మహిళ లు తరలివచ్చారు. ప్రధానంగా డీఆర్‌డీవో, వైద్యశాఖ, విద్యాశాఖ, ఐసీడీఎస్, వ్యవసాయ శాఖ, మత్స్యశాఖ, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆ యా మండలాల నుంచి బృందాలు సంబురాల్లో పాల్గొన్నాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు బతుకమ్మల ఆడారు. చిన్నారులు మొదలుకుని వృద్ధుల వరకు సంబురంలో పాల్గొన్నారు. ఆయా శాఖల వారీగా బృందాలకు బోర్డులను ఏర్పాటు చేసుకుని సంబురాల్లో మునిగితేలారు.

ఆకట్టుకున్న ఆటపాటలు
ఒక వైపు విద్యుత్ కాంతులు.. మరో వైపు బతుకమ్మ పాటలతో మినీ ట్యాంక్‌బండ్ పరిసరాలు హోరెత్తాయి. పగలంతా సాధారణంగా కనిపించిన ట్యాంకుబండ్ ప్రాంతం సాయంత్రం అయ్యే సరి కి జనసంద్రమైంది. పట్టణంలోని వివిధ వార్డుల నుంచి మహిళా బృందాలు భారీగా తరలివచ్చి వే డుకల్లో పాల్గొన్నారు. దాదాపు ఐదు గంటల పా టు మహిళలంతా ఆటపాటలకు అడుగులు వేస్తూ అలరించారు. ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ సంబు రం చూసిన వారందరికీ ప్రత్యేకంగా కనిపించింది. గతంలో పట్టణంలోని మైదానంలో నిర్వహిస్తున్న ఈ సంబురం ఈ ఏడాది నూతనంగా నల్ల చెరువు బండ్‌పైకి చేరడంతో జిల్లా కేంద్రానికి కొత్త శోభ వచ్చినైట్లెంది. బండ్ ప్రారంభం నుంచి చివరి వ రకు భారీగా తరలి వచ్చిన బృందాలతో ఆటపాట లు అలుపుసొలుపు లేకుండా కొనసాగాయి. సం బురాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి, జోగుళాంబ గద్వాల జెడ్పీ చైర్మ న్లు లోకనాథ్‌రెడ్డి, సరిత, ఎమ్మెల్యే అబ్రహం, కలెక్టర్ శ్వేతామొహంతి, ఎస్పీ అపూర్వరావులు అం దెలు వేస్తూ ఉత్సవాలను రక్తి కట్టించారు. వీరికి జి ల్లా అధికార యంత్రంగమంతా చేయి కలపడంతో బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బృందాలను పరిశీలిస్తూ వచ్చిన ప్రజా ప్రతినిధులు, అధికారుల బృందం అక్కడక్కడ అడుగులు వేస్తూ రావడంతో చూపరులను ఉత్సాహపరిచింది. అనంతరం బండ్‌పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఘాట్‌లో కలెక్టర్, ఎస్పీలతోపాటు జెడ్పీ చైర్మన్లు బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

విశ్వవ్యాప్తమైన బతుకమ్మ సంబురం : మంత్రి
బతుకమ్మ సంబురం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకతను చాటుకుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. మంత్రికి నిర్వాహకులు భాజాభజంత్రీలతో ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతి ప్ర జ్వలన చేసి మంత్రి లాంఛనంగా మహాబతుకమ్మ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ నాటి తెలంగాణ బతుకమ్మ విశిష్టతలను సినిమా రంగాన్ని అడ్డం పెట్టి మరిపించే ప్ర యత్నం చేశారని తెలిపారు. 2009 నాటి తెలంగాణ ఉద్యమం ద్వారా మరోసారి బతుకమ్మ సం బురం తెరపైకి వచ్చిందని గుర్తు చేశారు. 2010 లో పుట్టిన తన మనుమరాలుకు బతుకమ్మ అని పిలుచుకున్నానని, ఆరు నెలలకే ఆ పాప జై తెలంగాణ అంటూ నినందించిందన్నారు. 2010 తర్వా త పుట్టిన ప్రతి చిన్నారుల చేత జై తెలంగాణ అం టూ నినందించే వరకు ఉద్యమ తీవ్రత చేరిందని మంత్రి ఉదహరించారు. ఈ పరిస్థితిలో నేడు లం డన్, న్యూయార్క్, ఆస్ట్రేలియాలాంటి దేశాలతోపా టు తెలంగాణ ప్రజలున్న ప్రతిచోట బతుకమ్మ సంబురం దేశవిదేశాల్లో విజయవంతంగా కొనసాగుతుందన్నారు. మరికొన్నిచోట్ల బతుకమ్మ విశిష్టతను డాక్యుమెంటరీల రూపాల్లో చూయిస్తున్నారన్నారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుందని, వాటిని గౌరవించకపోయినప్పటికీ అణగదొక్కే ప్రయత్నాలు ఉండకూడదన్నారు. నా డు విస్మరించిన బతుకమ్మ సంబురం నేడు విశ్వవ్యాప్తం చేసిన ఘనత తెలంగాణ సమాజానికి ఉం దన్నారు. గ్రామ గ్రామాన చెరువు కట్టలపై బతుక మ్మ సంబురం ప్రకృతిని ప్రతిబింబింపజేస్తూ బతుకమ్మ సంబురాలు కొనసాగుతున్నాయన్నారు.

గ తేడాది మినీ ట్యాంక్ బండ్‌పై బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తామని చెప్పానని, కలెక్టర్ చొరవతో నేడు బతుకమ్మ సంబురాలను ఇక్కడ నిరాడంబరంగా కొనసాగించుకుంటున్నామని చెప్పా రు. ఉత్సవాల్లో ప్రతిభకనబర్చిన డీఆర్‌డీఏ బృం దానికి మొదటి బహుమతిగా రూ.10 వేలు, ద్వితీ య బహుమతి కడుకుంట్ల పీహెచ్‌సీ బృందానికి రూ.5 వేలు, తృతీయ బహుమతి రేవల్లి మండల మహిళా సమాఖ్య బృందానికి రూ.మూడు వేలను అందజేశారు. అనంతరం పల్లె ప్రగతిపై మేడికొండ ప్రసాద్ రచించిన పాటల సీడీని మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ వేణుగోపాల్, డీఆర్‌డీవో ఆర్డీవో చంద్రారెడ్డి, జెడ్పీ సీఈవో నరసింహులు, డీపీవో రాజేశ్వరి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ రమేశ్ గౌడ్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టు యాదవ్, నాయకులు పరశురాం, తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...