మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జేసీ


Thu,October 3, 2019 01:19 AM

వనపర్తి రూరల్ : మండలంలోని పెద్దగూడెం, చిట్యాల గ్రామాలకు గురువారం మంత్రులు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవల్లి దయాకర్‌రావులు రానున్న సందర్భంగా జేసీ వేణుగోపాల్‌రావు, ఎంపీపీ కిచ్చారెడ్డిలు బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాకు తొలిసారిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవల్లి దయాకర్‌రావు వస్తున్నట్లు వారు చెప్పారు. మొదట చిట్యాల పంచాయతీకి చేరుకొని 30 రోజుల ప్రణాళికకు సహకరించిన దాతలను సన్మానిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పెద్దగూడెం గ్రామంలో సభ నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు. అనంతరం ఎంపీపీ కిచ్చారెడ్డి మాట్లాడుతూ పెద్దగూడెం, చిట్యాల పంచాయతీలకు రాష్ట్ర మంత్రులు రానున్న సందర్భంగా సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున్న తరలిరావాలన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ రాజేందర్ గౌడ్, సర్పంచులు సర్పంచ్ భానుప్రకాశ్‌రావు, సర్పంచ్ కొండయ్య, ఉప సర్పంచ్ భాస్కర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నేడు మంత్రి ఎర్రబెల్లి దయకర్‌రావు పర్యటన
మహబూబ్‌నగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామీణాభివృధ్ధి శాఖ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయకర్‌రావు వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. ఉదయం 8ః30 గంటలకు హైద్రాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 9 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి 9ః15 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా వనపర్తి మండలంలోని పొల్కంపల్లిలో నిర్వహిస్తున్న గ్రామసభకు హాజరవుతారు. పోల్కంపల్లి నుంచి బయలుదేరి 12 గంటలకు చిట్యాలలో జరిగే గ్రామసభలో పాల్గొంటారు. మధ్యాహ్న భోజనం తర్వాత పెద్దగూడెం చేరుకొంటారు. 3ః30 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లాలోని హన్వాడ మండల కేంద్రంలో గ్రామసభలో పాల్గొంటారు. అనంతరం హెలిక్యాప్టర్ ద్వారా తిరిగి బేగం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...