ఉద్యోగం జీవితానికి భద్రతనిస్తుంది : మంత్రి సింగిరెడ్డి


Thu,October 3, 2019 01:18 AM

వనపర్తి విద్యావిభాగం : ఉద్యోగం ఓ వ్యక్తి జీవితానికి ఎంతో భద్రత ఇస్తుంద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని దాచలక్ష్మయ్య ఫంక్షన్‌హాల్‌లో ఇటీవల విడుదలైన ఎస్సై, కానిస్టేబుళ్ల ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. వ్యక్తి ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలని సూ చించారు. జిల్లా ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ ఏకాగ్రత, శ్రద్ద, పట్టుదలతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా 76 కానిస్టేబుల్స్, 21 మంది ఎస్సైలు, 6గురు వీఆర్‌వోలతో పాటు శిక్షణకు సమయం వెచ్చించి వారి విజయానికి తోడ్పాటును అందించిన పోలీస్ సిబ్బంది రాజగౌడ్, ఎండీ గౌస్‌పాషా, రాములు, కుమార్‌లను శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఉద్యో గం పొందిన అభ్యర్థులకు మెమోంటో శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కరెంట్ అఫైర్స్ నిపుణులు మట్టపల్లి రాఘవేందర్, సీఐ సూర్యనాయక్, శశిభూషన్, రాజు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...