చెరువులన్నీ నిండాలి


Sat,September 21, 2019 01:37 AM

-ఘణపురం, బుద్దారం కాలువ పనులు వేగవంతం చేయాలి
-బ్యాంకింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి
-కాలువలు పూర్తి కాని చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి
-అధికారులతో సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి


వనపర్తి, నమస్తే తెలంగాణ : జిల్లా పరిధిలోని చెరువులన్ని నిండేలా సాగునీటి అధికారులు కృషి చేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి ఛాంబర్‌లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, సాగునీటి శాఖ అధికారులతో మంత్రి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని ఖిల్లాఘణపురం బుద్దారం కాలువ పనులు వేగవంతం చేయాలని అన్నారు. అడ్డాకుల, పెద్దమందడి, మూసాపేట మండలాలోని చెరువులు నింపేందుకు అడ్డంకులు లేకుండా, బ్యాంకింగ్ పనులను పూర్తి చేయాలని చెప్పారు. ఘణపురం బ్రాంచ్ కెనాల్‌పై వయోడెక్ట్, అండర్ పాస్‌లను పూర్తి చేసి షాపూర్, మానాజిపేటకు నీరందంచాలని అన్నారు.

ఏదుల నుంచి బుద్దారం కాలువ లింక్ పనుల సర్వేను వెంటనే పూర్తి చేయాలని, షాపూర్, కర్నెతండా, మార్కండేయ లిప్ట్ ప్రతిపాదనలను పంపాలని పేర్కొన్నారు. కాలువలు పూర్తికాని చోట ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి చెరువులన్నింటిని నీటితో నింపాలని మంత్రి సూచించారు. ఈ ఏడాది నీరు పుష్కలంగా ఉందని, అన్ని చెరువులను క్రమపద్ధతిలో నింపుతామని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అడ్డాకుల మండలంలో అన్ని చెరువులను నింపాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో సాగునీటి శాఖ ఈఈ సంజీవరావు, డీఈ సత్యనారాయణ గౌడ్, జెడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...