గత రికార్డును తిరగరాయాలి


Sat,September 21, 2019 01:33 AM

వనపర్తి రూరల్ : వేరుశనగ పంటను పండించడంలో జిల్లాకు మంచి పేరు ఉన్నదని, గత రికార్డును తిరగరాసేలా పండించాలని జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని బాలనగర్‌లో ఉన్న వ్యవసాయ సహకార పరపతి కేంద్రంలో సబ్సిడిడీ వేరుశనగ విత్తనాలను రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డిలతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు అందించాలన్న లక్ష్యంతో నేరుగా రైతులకు సబ్సిడీ రూపంలో అందిస్తున్నదన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని రైతులు వేరుశనగ పంటలో జిల్లాలో రిక్డార్డు స్థాయి పంటను పండించాలని కోరారు. ఈ సారి పుష్కలంగా సాగునీరు న్నదని, ప్రతి రైతుకు తగినంత విత్తనాలను అందించడానికి వ్యవసాయశాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇతరుల మాటలు నమ్మి మోసపోవద్దని, అలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...