రంగసముద్రం నుంచి నీటి విడుదల


Sat,September 21, 2019 01:33 AM

పెబ్బేరు రూరల్ (శ్రీరంగాపురం) : శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి భీమా కాలువకు నీటిని విడుదల చేశారు. శుక్రవారం తాసిల్దార్ శాంతిలాల్, ఎంపీపీ గాయత్రి, జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్‌లు పూజలు నిర్వహించి గేట్లను పైకెత్తారు. ఈ నీళ్లు 16వ ప్యాకేజీ మైయి న్ కెనాల్ ద్వారా ప్రవహించి, గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు నింపుతాయి. కార్యక్రమంలో భీమా ప్రాజెక్టు డీఈ ఆంజనేయులు, ఏఈ మహేశ్వర్, సర్పంచ్ వినీలారాణి, ఎంపీటీసీ ఎల్లస్వామి, వీఆర్వో నాగరాజు, పంచాయతీ కార్యదర్శి సహదేవుడు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...