భరోసా కల్పించేందుకే కార్డన్‌సెర్చ్


Sat,September 21, 2019 01:32 AM

-ఎస్పీ అపూర్వరావు
వనపర్తి విద్యావిభాగం : శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ అపూర్వరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నందిహిల్స్ కాలనీలో కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నందిహిల్స్ కాలనీలో 720 ఇండ్లను తనిఖీ చేసి ఎలాంటి ధ్రువపత్రాలు లేని 79 ద్విచక్ర వాహనాలను, ఐదు ఆటోలను స్వాధీనం చేసుకొని పట్టణ ఠాణాకు తరలించినట్లు ఆమె పేర్కొన్నారు. కాలనీ ప్రజలతో ఆమె మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి, భద్రత భావం గురించి సైన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం, ప్రజల యొక్క సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. గ్రామంలో ఎవ్వరైనా నేరస్తులు కానీ కొత్త వ్యక్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారనే విషయం కూడా తెలుస్తుందని అన్నారు. నేరరహిత గ్రామాలుగా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్డెన్‌సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కళాబృందాలచే గ్రామ గ్రామాలన సభలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

గ్రామాలలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాలు, పెద్దలు, వ్యాపారస్తులు, నాయకులు, ఉద్యోగులను భాగస్వాములను చేస్తు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈ సీసీ కెమెరాలతో అమాయక ప్రజలను నేరాల నుంచి విముక్తి, నేరాలను పట్టుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ తదితర అన్ని డాక్యుమెంట్లను వాహనాదారులు కాలిగి ఉండాలని అన్నారు. ఈవ్ టీజింగ్, బాలికల వేదింపులు ఇంట్లో పిల్లలు చెడు అలవాట్లకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని, 6303923208 నంబర్‌కు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో అదనపు ఎస్పీ సృజన, సీఐలు సూర్యనాయక్, ఎస్సైలు తిరుపాజీ, నరేందర్, ఉమా, సురేశ్, వహిద్‌అలీ, వెంకటేశ్‌గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...