రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా విద్యార్థుల ఎంపిక


Sat,September 21, 2019 01:32 AM

వనపర్తి క్రీడలు : జిల్లా కేంద్రంలోని టెమ్రిస్ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆయా పోటీలలో రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ విజిత, పీఈటీ సుజాతలు తెలిపారు. శుక్రవారం పాఠశాలలో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి శ్యామూల్ జాకబ్‌తో పాటు డీఎల్‌సీ డాక్టర్ గులాంహుస్సేన్‌లు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విద్యార్థులు హాండ్‌బాల్, ఆర్చరీ, నెట్‌బాల్, బాస్కెట్ బాల్, త్రోబాల్ ఈవెంట్స్‌లలో సత్తాచాటి రాష్ట్ర స్థాయికి జిల్లా తరుపున ఎంపికయ్యారని వారు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ర్టానికి మంచి పేరు ప్రతిష్టలను తీసుకురావాలని అన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...