ప్రగతి పనుల్లో వేగం పెరగాలి


Sat,September 21, 2019 01:31 AM

పెబ్బేరు రూరల్ : పల్లెప్రగతి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ శ్వేతామొహంతి అన్నారు. శుక్రవారం పెబ్బేరు మండల పరిధిలోని అయ్యవారిపల్లె, శ్రీరంగాపురం మండలంలోని వెంకటాపురంలో ఆమె పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదేళ్ల వరకు సర్పంచులకు సర్వాధికారాలుంటున్నందున గ్రామాలను అన్ని రకాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. 30 రోజుల ప్రణాళికా పనులను పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా కనిపించాలని, ఎక్కడా అపరిశుభ్రతకు చోటివ్వరాదని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పెబ్బేరు ఎంపీపీ శైలజ, జెడ్పీటీసీ పద్మ, శ్రీరంగాపురం ఎంపీపీ గాయత్రి, జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, సర్పంచులు స్వాతి, శశిభూషణ్, డీఆర్డీవో గణేశ్ పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...