గ్రామాల అభివృద్ధికే 30 రోజుల ప్రణాళిక


Sat,September 21, 2019 01:31 AM

-కలెక్టర్ శ్వేతా మొహంతి
పెబ్బేరు : గ్రామాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం 30 రోజుల ప్రణాళికను ప్రారంభించిందని కలెక్టర్ శ్వేతామొహంతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఆమెతో పాటు జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి పల్లె పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 30 రోజుల ప్రణాళికను ప్రతిష్టాత్మికంగా ప్రవేశపెట్టిందని వారు పేర్కొన్నారు. అందులో భాగంగానే జిల్లాల్లోని ప్రతి పల్లెల్లో పరిశుభ్రతతో పాటు పచ్చదనం పనులు జోరుగ సాగుతున్నాయని అన్నారు. ప్రజల సహకారంతోనే గ్రామంలో అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజలతో మమేకమై గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శలు సమన్వయంతో గ్రామాల్లో ప్రణాళిక పనులను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. గ్రామాల్లో మురుగు కాలువలను, పాత ఇండ్లను కూల్చివేసి ఇండ్ల మధ్యలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి పరిశుభ్రంగా ఉండేవిధంగా పనులు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీలు శైలజ, గాయత్రి, జెడ్పీటీసీలు పద్మ, రాజేంద్రప్రసాద్, వైస్ ఎంపీపీ బాలచంద్రారెడ్డి, డీపీవో రాజేశ్వరీ, డీఆర్డీఏ గణేశ్, పీఆర్ ఈఈ శివకుమార్, ప్రజాప్రతినిధులు, ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...