బాలికల సాధికారితకు కృషి చేయాలి


Fri,September 20, 2019 01:39 AM

వనపర్తి విద్యావిభాగం : ప్రతి పాఠశాలలో బాలిక సాధికారితను సాధించేందుకోసం సమర్ధవంతంగా పనిచేయాలని కలెక్టర్ శ్వేతామొహంతి సూచించారు. గురువారం కౌమర విద్య, బాలికల సాధికారత సాధించే లక్ష్యంగా ఒక్కరోజు అవగాహన కార్యక్రమాన్ని బాలభవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కౌమర దశలో బాలికల్లో వచ్చే శారీరక, మానసిక, ఉద్వేగ మార్పులు వేగవంతంగా జరుగుతాయని ఈ సందర్భంలో బాలికలు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారని, సిగ్గు, బిడియం లాంటి సమస్యలు ఉత్పన్నమై మార్పులకు అనుగుణంగా ఎవ్వరితో చెప్పుకోలేక ఆందోళనకు గురవుతారన్నారు. ఇలాంటి దశలో ఉపాధ్యాయురాలు కాని తల్లిదండ్రులు కానీ తోడ్పాటునిస్తు స్వేచ్ఛగా భావాలు వ్యక్తం చేసేలా ఫ్రెండ్లి నేచర్‌తో ఉండాలన్నారు. బాలికలో రక్తహీనత, ఆరోగ్యపరమైన సమస్యలు, ఈవ్ టీజింగ్, సైబర్‌క్రైం తదితర అంశాలలో పాఠశాలలో ఉపాధ్యాయులు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీటీమ్‌లు, సాంఘీక సంక్షేమ హాస్టల్స్‌లో సోషల్ వెల్ఫెర్ అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమా లు నిర్వహించాలని అన్నారు.

ఈ అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాస్థాయిలో ప్రతి పాఠశాలలో ఈ క్లబ్‌లు సమర్థవంతంగా పనిచేసేలా చూడాలన్నారు. మొదటిసారి గా జిల్లా వ్యాప్తంగా కేజీవీబీలు, ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 26 పాఠశాలలను ప్రారంభిస్తున్నామని ఆమె చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో బాలికలు భరోసా కల్పించే విధంగా ఈ క్లబ్‌లు విస్తరించి పనిచేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు ఆడే పాము, నిచ్చెన లాంటి ఆటకు సంబంధించిన చాట్‌ను అంగన్‌వాడీ విద్యార్థులకు, ఆహారం, పరిసరాల విధానం పై, పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలు వాటి పరిష్కార మార్గాలు తదితర అంశాలపై చాట్ రూపంలో ఉన్న ప్రదర్శ ఆకట్టుకుంది. కలెక్టర్‌తో పాటు, డీఈవో సుశీందర్‌రావు చాట్‌లోని అంశాలపై వివరించారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జిల్లా ఆఫీసర్ శ్రీనివాసులు, ఏస్పీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటస్వామి, సీఐ సూర్యనాయక్, ఆర్డీవో నరేందర్‌నాయక్, శిక్షకులు శంకరయ్య, బాలవర్దన్, శ్రీధర్‌రెడ్డి, హెచ్‌ఎంలు, కేజీబీవీ ఎస్‌వోలు తదితరులు హాజరయ్యారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...