గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి


Fri,September 20, 2019 01:38 AM

పెద్దమందడి : గ్రామాలలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అందరు కలిసికట్టుగా ముందుకు రావాలని జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని వీరాయపల్లి గ్రామంలో కలెక్టర్ శ్వేతామొహంతి, ఎస్పీ అపూర్వరావు, ఎంపీపీ మేఘారెడ్డిలతో కలిసి 30 రోజుల కార్యాచరణలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరు బాధ్యతగా తీసుకుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ 30 రోజుల కార్యాచరణలో భాగస్వాములై గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. గ్రామాలలో ఎక్కడైనా ప్రైవేట్ ప్లాట్లలో, స్థలాల్లో పిచ్చి మొక్కలు, కంప చెట్లు ఉన్న వాటిని తొలగించేందుకు యజమానులకు నోటీస్‌లు ఇవ్వాలని అన్నారు. ఎక్కడ కూడా గ్రామాలలో చెత్త చెదారం ఉండకుండా చేయాలని పేర్కొన్నారు. గ్రామాలలో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేపట్టాలని, మురుగు కాలువలను శుభ్రం చేసి బ్లిచింగ్ పౌడర్ చల్లేలా చూడాలని ప్రజాప్రతినిధులకు, గ్రామాల అధికారులకు సూచించారు. అనంతరం అంగన్‌వాడీ కార్యాలయం వద్ద గ్రామ మహిళలు, యువకులతో కలిసి పిచ్చి మొక్కలు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం అక్కడ మొక్కలను నాటారు. అదేవిధంగా గ్రామాలలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించి ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ శ్వేతామొహంతి అన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల వివిధ రకాల రోగాలు రావడంతో పాటు పర్యావరణంలో మార్పులు జరిగి కాలుష్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో చైతన్యం వస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నరసింహులు, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సర్పంచ్ భాగ్యమ్మ, తాసిల్దార్ ఘాన్షీరాం, ఎంపీడీవో నాగశేషాద్రిసూరి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు రాజప్రకాశ్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...