ఓ రూపానికి రావాలి


Fri,September 20, 2019 01:38 AM

వనపర్తి రూరల్ : తెల ంగాణ రాష్ట్ర సమితి జి ల్లా పార్టీ కార్యాలయ నిర్మాణం దసరా పం డుగ నాటికి ఓ రూపానికి రావాలని మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలో ని రాజపేట గ్రామ శివారులో నిర్మాణం చేపట్టిన జిల్లా పార్టీ కార్యాలయ పనులను పార్టీ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు వేగవంతం అయ్యాయిని, మన జిల్లా కేంద్రంలో నిర్మాణం తలపెట్టిన పనులను దసరా పండుగా రోజునాటికి ఓ రూపం తీసుకొచ్చేలా కృషి చేయాలని కాంట్రాక్ట్‌ర్లకు సూచించారు. పనులలో వేగంతో పాటు, నాణ్యత ఉండాలన్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణం భవిష్యత్తు తరాలకు భరోసాగా నిలిచేగా ఉండేలా సీఎం కేసీఆర్ వీటి నిర్మాణం లో జాగ్రత్తలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలోని అన్ని ఓకే రూపంలో భవనాలు నిర్మాణం కాబోతున్నాయని తెలిపారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు గుట్టు యాదవు, రాజు, దేవన్న, చిన్నుమియ్య, ఖాజ, రంగస్వామి పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...