తాడిపర్తి చెరువును అలుగు పారిస్తాం


Fri,September 20, 2019 01:38 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : దశాబ్దాలుగా సాగునీటికి నోచుకోక మరుగున పడిన నల్లచెరువుకు మూడు రోజులుగా కృష్ణమ్మ నీరు వచ్చి చేరుతున్నాయని, అలాగే తాడిపర్తి చెరువును అలుగు పారిస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక టీఆర్‌ఎస్ నేతలతో కలిసి పట్టణ శివారులో గల నల్లచెరువు కాలువ వద్ద కృష్ణ జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణం నడిబొడ్డున గల నల్లచెరువును మినీట్యాంక్‌బండ్‌గా రూ.6.50కోట్లతో తీర్చిదిద్దుతున్నామన్నారు. మినీట్యాంకుబండ్‌లో ఈ సారి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటామని అన్నా రు. గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామ చెరువును అలుగులు పారిస్తామన్నారు. మినీట్యాంకు బండ్‌కు వచ్చే దారిలో ఏమైనా కంపచెట్లు మిగిలినట్లయితే వెంటనే తొలగించి నీళ్ల రాకకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చూడాలని స్థానిక నాయకులకు మంత్రి ఆదేశించారు. మిషన్ కాకతీయలో భాగంగా వనపర్తి నియోజకవర్గంలో 450పైగా చెరువులు పునరుద్ధరించామని తెలిపారు. 70వేల ఎకరాలకు ఖిల్లాఘణపురం, పెద్దమందడి, భీమాఫేజ్ 2 బుద్దారం ఎడమ కాలువల నుంచి సాగునీరు అందించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి వివరించారు. వచ్చే ఐదేళ్లలో వ్యవసాయ రంగ స్వరూపం మారిపోతుందని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి నీళ్లను తీసుకొస్తున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఉస్మాన్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు మురళీసాగర్, శాంతన్న, విష్ణు ఉన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...