హరితమయం


Thu,September 19, 2019 02:28 AM

-పచ్చదనానికి కేరాఫ్ వనపర్తి డిగ్రీ కళాశాల
-కళాశాల ఆవరణలో పండ్లు, పూల మొక్కలు
-మొక్కలను సంరక్షిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు
-స్ఫూర్తినిచ్చిన మంత్రి నిరంజన్‌రెడ్డి
-వెయ్యి మంది విద్యార్థులకు రెండు వేల మొక్కల పంపిణీ


వనపర్తి విద్యావిభాగం: వృక్షాన్ని రా.. నేను వృక్షాన్ని రా.. గాలినిస్తాను, నీడనిస్తాను, వాతావరణ సమతుల్యత చేస్తాను, చివరికీ నీ పాడెనై నేనే తీసుకెళ్తాను.. కర్రగా ఉపయోగపడతాను.. ప్రముఖ కవి, గాయకుడు గొరేటి వెంకన్న రాసిన పాటను నిజం చేస్తు నాటిన ప్రతిమొక్కను కాపాడడమే ధ్యేయంగా సంరక్షిస్తున్నారు వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు. మొక్కలను పెంచేందుకు ఏటా మహా కార్యక్రమంగా చేపడుతున్నారు. కళాశాలలో రకరకాల పండ్ల మొక్కలు, పూలు మొక్కలు, నీడనిచ్చే మొక్కలు నాటారు. కళాశాల ముందుభాగం నుంచి ప్రధాన రహదారి వెంట రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెంచడంతో కళాశాలకు వచ్చే విద్యార్థులు ఆ చెట్ల కిందే కూర్చోని చదవడం, మధ్యాహ్న భోజనం చేయడం లాంటి పనులకు ఆ చెట్లు నీడనిస్తున్నాయి. కళాశాల భవనం వెంట ఆందమైన గార్డెన్ మొక్కలను పెంచి సంరక్షించడంతో కళాశాలకు ప్రత్యేక ఆకర్శన, అలంకరణ ఇస్తున్నాయి. కళాశాల వెనుకభాగంలో జామ, దానిమ్మ మొక్కలతోపాటు ఇతర పండ్ల మొక్కలు నాటడంతో నేడు ఆవి ఫలాలనిస్తున్నాయి.

మంత్రి నిరంజన్‌రెడ్డి స్ఫూర్తితో..
ఈ ఏడాది హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి ఇచ్చిన స్ఫూర్తితో ఒక్కొక్కరూ రెండు మొక్కల చొప్పున నాటి వాటికి తమకిష్టమైన తల్లిదండ్రులు, మిత్రులు, పుట్టిన రోజుల్లో కానుకగా నాటితే దానిని సంరక్షించే బాధ్యత తీసుకుంటారని మంత్రి చెప్పడం జరిగింది. భూమి లేనివారు ఉన్న తమ మిత్రుల ఊర్లకు వెళ్లినప్పుడు వారి మిత్రుల భూములలో తమకు గుర్తుగా మొక్కలు నాటి రావాలని సూచించారు. అదేవిధంగా తమ ఇంటి పరిసరాలు, పెరట్లలో, పూల మొక్కలు, పండ్ల మొక్కలు, పూజలు చేసే మొక్కలు నాటి వాటికి తమకిష్టమైన పేర్లు పెట్టి నిత్యం చేతులు, కాళ్లు ఆ మొక్కల వద్దనే కడుక్కుంటే అవే బతుకుతాయని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. ఆయన స్ఫూర్తితో కళాశాలలో రెండు వేల మొక్కలను వెయ్యి మంది విద్యార్థులకు అందజేసి నాటేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. అధ్యాపకులకు, ఎన్‌సీసీ కోఆర్డినేటర్లకు బాధ్యతలు అప్పగించి డీఎం దేవదానం, సహాయ మేనేజర్ దేవేందర్ చేతులమీదుగా పంపిణీ చేశారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...