గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి


Thu,September 19, 2019 02:25 AM

వనపర్తి,నమస్తే తెలంగాణ : రాష్ట్రంలోని గ్రామాలను పరిశుభ్రతకు మారుపేరుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో పంచాయతీల్లో 30రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుపై వీడియో కాన్ఫెరెన్సు ద్వారా సమీక్షించారు. అన్ని గ్రామాల్లో ప్రణాళిక ఖచ్చితంగా అమలు జరిగేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రతి గ్రామ పంచాయతీకి వార్షిక ప్రణాళికతో పాటు పంచవర్ష ప్రణాళిక తయారు చేయాలని, ఇది వరకే నిర్దారించినట్లు గ్రామంలో పాడుబడిన బావులు, బోర్లను పూడ్చి వేయడం చేయాలని, మురికి కాలువలు రోడ్లను శుభ్రం చేయాలని తదితర అంశాలను వెల్లడించారు. పాడుబడిన ఇండ్లను తొలగించాలని, కంపచెట్లు, చెత్తా చెదారంలను తీసివేయాలని ఆయన కోరారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్‌కు జిల్లా కలెక్టర్ శ్వేతామొహంతి, జెడ్పీ సీఈవో నరసింహులు, డీపీఓ రాజేశ్వరి, ఇతర జిల్లా అధికారులు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...