ఓటరు కార్డులో మార్పులు సరి చూసుకోండి


Thu,September 19, 2019 02:24 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : కూర్చొన్న చోట నుంచి ఓటరు గుర్తింపు కార్డులో ఏవైనా మార్పులు ఉన్నట్లయితే సంబంధిత డ్యాకుమెంటు జత చేయడం ద్వారా సరి చేసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. బుధవారం జిల్లా అధికారులకు ఉద్దేశించి కలెక్టర కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్‌వీఎస్‌పీ లేదా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఓటర్లు ఓటర్ గుర్తింపు కార్డు ఆధారంగా పరిశీలన చేసుకోవచ్చన్నారు. ప్లే స్టోర్ ద్వారా ఓటర్ హెల్ప్‌లైన్‌లో ఈవీపీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఫోటో గుర్తింపు కార్డుతో పాటు పూర్తి చిరునామా పరిశీలించుకోవాలని సూచించారు. వచ్చేనెల 15 వరకు పరిశీలించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌వో వెంకటయ్య, ఆర్డీవో చంద్రారెడ్డి ఉన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...