నేర రహిత సమాజమే..పోలీసుల లక్ష్యం : ఎస్పీ


Thu,September 19, 2019 02:24 AM

వనపర్తి విద్యావిభాగం : నేర రహిత సమాజ నిర్మాణం కోసం పోలీస్ శాఖ కృషిచేయాలని ఎలాంటి నేరాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నేరస్తులపై వెంటనే చర్యలు తీసుకున్నప్పుడే నేరరహిత సమాజం నిర్మితమవుతుందని జిల్లా ఎస్పీ అపూర్వరావు అన్నారు. బుధవారం వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ అదికారులతో నేర సమిక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు కృషి చేయాలన్నారు. అలాగే పెండింగ్ కేసులు, బెయిల్స్, నేరస్తులను గుర్తించడం, పీటీ కేసులలో పరీక్షలకు ముందు సాక్షులను బ్రీతింగ్ చేయడం, ఎఫ్‌ఐఆర్ తర్వాత ఇన్వెస్టిగేషన్ అధికారి మాత్రమే స్వయంగా వ్రాతపూర్వకంగా వివరాలు నమోదు చేయాలన్నారు. 100 కు వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, ఆ ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయ్యాలని ఆమె సూచించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ మెరుగు పడాలన్నారు. ఏ సమయంలో అడిగిన చెప్పే విధంగా ఉండాలన్నారు. పోలీస్ ష్టేషన్లలోని రిసెప్షన్, బ్లూకోర్ట్స్, పెట్రోకార్స్, కోర్టు డ్యూటీ, డయల్ 100, సెక్షన్ ఇన్‌చార్జ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తరుచుగా నేరాలకు పాల్పడుతున్న నేరస్తుల జాబితాను సిద్దం చేసి పీడీ యాక్ట్ అమలు పరచడానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రతిరోజు ఫిటిషన్లను తప్పకుండా నమోదు చేయాలని లేనిపక్షంలో రిసెప్షనిస్ట్, ఎస్సైలపై చర్యలు ఉంటాయన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సీఐలు వెంకటేశ్వర్‌రావు, శంకర్ తదితరులు ఉన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...