కులవృత్తులను ప్రోత్సహిస్తున్న సర్కారు


Thu,September 19, 2019 02:23 AM

చిన్నంబావి : కులవృత్తులను ప్రోత్సహించడం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని బెక్కెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి కోసం ఉచితంగా పంపిణీ చేసిన లక్షా 60 వేల చేప పిల్లలను చెరువులో విడుదల చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఆయా కులవృత్తులకు సంబంధించిన పనిముట్లు, తదితర వాటిని పంపిణీ చేస్తున్నామన్నారు. గతంలోని ప్రభుత్వాల కంటే టీఆర్‌ఎస్ సర్కారు కులవృత్తులను ప్రోత్సహిస్తూ వారికి కావల్సిన సామగ్రిని అందజేస్తుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. చేపలు పట్టడానికి వలలు, మార్కెట్‌కు చేపలను రవాణా చేసేందుకు బైక్‌లు, ఆటోలను అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం వలలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీ రాధారోహిణి, ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ వెంకట్రామమ్మ, సర్పంచ్ పద్మ, వార్డు మెంబర్ రామస్వామి, ఈదన్న, చిదంబర్‌రెడ్డి, మత్స్యకారుడు బాలకిష్టి పాల్గొన్నారు.

పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
చిన్నంబావి : మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఎస్పీ అపూర్వరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ కేసులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. స్టేషన్‌కు వచ్చే వారితో అప్యాయంగా మెలగాలని సూచించారు. అనంత రం రికార్డులను పరిశీలించారు. ఎస్పీ వెంట ఎస్సై సురేశ్, ఏఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...