సోమశిల-సిద్దేశ్వరం వంతెన పై చిగురించిన ఆశలు


Wed,September 18, 2019 01:38 AM

కొల్లాపూర్,నమస్తేతెలంగాణ;తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య కృష్ణానది పై కొల్లాపూర్ మండలం సోమశిల-సిద్దేశ్వరం వారధి నిర్మాణం ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతప్రజల చిరకాలవాంచ.ఈ విషయాన్ని గూర్చి మంగళవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడి ప్రస్తావిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.దీనికి స్పందించిన రాష్ట్ర రోడ్లు భవనాలశాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ప్రకటించడంతో కొల్లాపూర్ నియోజకవర్గం ప్రజల్లో ఆశలుచిగురిస్తున్నాయి.ఎన్నో ఏళ్లుగా సోమశిల-సిద్దేశ్వరం వంతెన కోసం నిరీక్షిస్తున్న ఈ ప్రాంత ప్రజల్లో తెలంగాణ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.రాయలసీమ-తెలంగాణ ఇరుప్రాంతాల ప్రజల బంధుత్వాలు ఉన్నాయి.కృష్ణానది పరివాహాక ప్రాంతాలతో ఇరు ప్రాంతాల ప్రజలకు విడదీయరాని బందాలుండడంతో పండుగలు,పబ్బాలు,మంచి చెడులకు నదిలో పుట్టీల పైనే ప్రయాణం నిత్యంచేస్తుంటారు.కృష్ణానది పై వంతెన నిర్మాణం కోసం నాటి సమైఖ్యరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009 ఫిబ్రవరి 12వతేదీన కొల్లాపూర్‌లో శిలాఫలకం వేశారు.ఇందుకు ప్రధాన కారణం 2007 జనవరి 18న కొల్లాపూర్ మండలం సింగవట్నం లక్ష్మీనర్సింహ్మస్వామి బ్రహ్మోత్సవాలకు రాయలసీమ నుంచి భక్తులు మరోబోటులో వస్తూ మంచాలకట్ట వద్ద 61మంది సీమాంధ్ర భక్తులు జలసమాధికావడంతో అప్పటి ప్రభుత్వంలో కదిలక వచ్చి వంతెన కోసం వైఎస్ శిలాఫలకం వేసి చేతులు దులుపుకున్నారు.సమైఖ్యకాంధ్రప్రదేశ్‌లో జీవో ఆర్టీ నెంబర్ 410 తేదీ 06-05-2011 ప్రకారం వంతెన కోసం అప్పటి సీఎం వైఎస్ రూ,250 కోట్ల 30లక్షలు మంజూరు ఉత్తర్వులు జారీ చేశారుకూడా.ఈ వంతెన నిర్మాణం మూలంగా హైద్రాబాద్-నుంచి నాగర్‌కర్నూల్,కొల్లాపూర్,నందికొట్కూర్,నంద్యాల,చిత్తూరు,తో పాటు బెంగుళూరు,పుట్టపర్తి,చెన్నై,ప్రాంతాలకు 47కిలో మీటర్ల దూరం తగ్గుతుంది.దీంతో వ్యయం,సమయం తగ్గనున్నది.

తెలంగాణ ప్రభుత్వంలో...
ఇదిలావుండగా ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో మళ్లీ వంతెన నిర్మాణం విషయం తెరపైకి రావడంతో ఇందుకు సంబందించి వంతెన నిర్మాణం పైల్ రోడ్లు,భవనాలశాఖ ద్వారా సీఎం కేసీఆర్,రాష్ట్ర మంత్రుల ఆమోదానికి పంపారు.జీవో ఆర్టీ నెంబర్.131 తేదీ 27-11-2014 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వంతెన నిర్మాణానికి రూ,193 కోట్లు మంజూరు చేసింది.ఇందులో అప్పటి మంత్రి జూపల్లికృష్ణారావు చోరవతీసుకొని 2014 డిసెంబర్ 22న రాయలసీమ ప్రాంతానికి చెందిన నాటి మాజీమంత్రి ఏరాసు ప్రతాఫ్‌రెడ్డికి ఫోన్‌చేసి ఎలాంటి అడ్డంకులు లేకుండగా సహకరించాలని సూచించిన విషయం విధితమే.అయితే రెండు తెలుగు రాష్ర్టాల మధ్య కృష్ణానది పై వంతెన నిర్మాణానిఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రూ,100కోట్లు మంజూరు చేయించాలని జూపల్లి కోరారు.దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మరుగునపడిపోయింది.

వంతెన నిర్మాణమే ఎమ్మెల్యే బీరం ధ్యేయం
ఈ ప్రాంతాల చిరకాలవాంచ అయిన సోమశిల-సిద్దేశ్వరం మధ్య కృష్ణానది పై వంతెన నిర్మాణం సాధించితీరుతానని ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి గతంలోనూ,ఇప్పుడు కానీ సభలో సమావేశాల్లో మాట్లాడుతూ చెబుతున్నారు.రెండు తెలుగు రాష్ర్టాల మధ్య వంతెన నిర్మాణంతో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతం పారిశ్రామికంగా,రవాణా సౌకర్యంతో ఎంతో అభివృద్ధి చెందుతదని ప్రజల ఆశలను నేరవేర్చి తీరాలన్న పట్టుదలతో ఎమ్మెల్యే బీరం ఉన్నారు.వంతెన కోసం తనశక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఆదశగా ఎమ్మెల్యే బీరం పావులుకదుపుతున్నారు.గతనెలలో మంత్రి నిరంజన్‌రెడ్డి తల్లి దశదినకర్మకాండకు హాజరైన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి,ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌లను సోమశిల కృష్ణానది పై వంతెన నిర్మాణ ప్రదేశానికి ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి తీసుకొచ్చి చూయించారు.వంతెన నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం పర్యాటకరంగంతో పాటు మత్స్యసంపద ట్రాన్స్‌పోర్టుకు ఎంతో ఉపయోగపడనున్నదని ఎమ్మెల్యే బీరం సహచర ఎమ్మెల్యేలకు తన మనుస్సులోని మాటను వ్యక్తంచేశారు.అంతే కాకుండగా కొల్లాపూర్ మామిడి దేశ విదేశాలల్లో ంతో ప్రాచూర్యం పొందడంతో ఇక్కడి నుంచి ఎగుమతులకు ఎంతో వీలుంటుందని బీరం ఇష్టాగోష్టిలో మాట్లాడిన విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు. అయితే ఈ ఏడాది మార్చి నెలలో సోమశిల-సిద్దేశ్వరం మధ్య వంతెన నిర్మాణప్రదేశాన్ని చూసేందు కోసం నది పైమరబోటులో తమ పార్టీ నాయకులతోకలిసి ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి పర్యటించిన విషయాన్ని సోమశిల గ్రామ ప్రజలు గుర్తుచేస్తున్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...