జూరాలకు స్వల్పంగా వరద


Wed,September 18, 2019 01:37 AM

జోగుళాంబ గద్వాలజిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జూరాలకు స్వల్పంగా వదర కొనసాగుతుంది. జూరాల ఇన్‌ఫ్లో 29,000 క్యూసెక్కులు, అవుట్ ప్లో 42,107 క్యూసెక్కుల నమోదైంది. విద్యుత్ ఉత్పత్తి కోసం పవర్ హౌజ్ ద్వారా మాత్రమే 36,597 క్యూసెక్కల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ సామర్థ్యం 1045 అడుగుల ఎత్తులో 9.657టీఎంసీలుండగా ప్రస్తుతం 1044.5 అడుగుల ఎత్తులో 8.710 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి కాలువ ద్వారా 815 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 1,100 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 650క్యూసెక్కులు నీటిని అధికారులు కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. వీటితో పాటు నది నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్లకు నింపేందుకు నెట్టెంపాడు లిఫ్ట్‌లో 2 మోటర్లను ప్రారంభించి 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1 ద్వారా 650 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2 ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 630 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇక ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్ట్‌లకు కూడా వరద ప్రవాహం తగ్గిపోయింది. ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 62,991క్యూసెక్కులు కొనసాగుతుండటంతో అదేస్థాయిలో 62,991 క్యూస్కెల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిసమార్థ్యం 129.72 టీఎంసీలుండగా ప్రాజెక్ట్ అధికారులు నదిలో 128.19టీఎంసీల నీటిని నిల్వచేస్తున్నారు. నారాయణపుర ప్రాజెక్ట్‌లో ఇన్‌ఫ్లో 61,523క్యూసెక్కులుండగా అవుట్ ఫ్లో 62,991 క్యూసెక్కులు నమోదైంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 37.64టీఎంసీల నీటినిల్వ ఉండగా ప్రాజెక్ట్‌లో 37.48టీఎంసీల నీటిని నిల్వచేసుకొని వచ్చిన నీటిని వచ్చినట్టుగా నదిలోకి విడుదల చేస్తున్నారు.

సుంకేసులకు తగ్గుతున్న వరద
రాజోళి:సుంకేసుల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ నుండి మంగళవారం సాయంత్రానికి 14వేల400 క్యూసెక్కుల నీరు ఇన్‌ప్లో రాగా,3 గేట్లను తెరచిన అధికారులు 13 వేల 300 క్యూసెక్కుల దిగువకు వదిలారు. కేసీ కెనాల్ కు 1050 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు జేఈ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఆర్డీఎస్ ఆనకట్టకు కొనసాగుతున్న వరద
అయిజ: కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తోడు టీబీ డ్యాం నుంచి విడుదల అవుతున్న వరదతో ఆర్డీఎస్ ఆనకట్టకు నీటి ప్రవాహం కొనసాగుతున్నది. టీబీ డ్యాం నుంచి 7,685 క్యూసెక్కుల వరద విడుదల చేస్తుండటంతో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద నీరు స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 13,797 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, ఆనకట్టపై 16,840 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 9.3 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆర్డీఎస్ డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి ఆయకట్టుకు 624 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆర్డీఎస్ డీఈఈ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని సింధనూరు హెడ్‌రెగ్యులేటర్ సమీపంలో 291 క్యూసెక్కులు ఆయకట్టుకు చేరుతున్నట్లు ఆయన తెలిపారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...