ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి


Tue,September 17, 2019 02:54 AM

నారాయణపేట రూరల్ : గ్రామాలలో ప్రణాళికలు రూపొందించిన వాటి ప్రకారం గ్రామాలలో అభివృద్ధి పనులు నిర్వహించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెంకట్రావు అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. సోమవారం మండలంలోని అప్పక్‌పల్లి లో కొనసాగుతున్న మార్పునకు శ్రీకారం పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు చోట్ల మొక్కలు నాటి నీళ్లు పోశారు. అయితే గ్రా మంలో పర్యటిస్తున్న సందర్భంలో రోడ్డు అడ్డంగా ఎద్దులు కట్టేసి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ ఆ ఎ ద్దుల యజమానికి రూ.2000లు ఫైన్ విధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో 30 రో జుల ప్రణాళికలో భాగంగా పారిశుధ్య పనులు నిర్వహించాలని, ఈ పనులపై ఏమాత్రం అశ్రద్ధ వహించినా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటమ్మ, తాసిల్దార్ రాజు, ఎంపీడీవో వెంకటయ్య, గ్రామ ప్రత్యేకాధికారి ప్రణీత, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింహారెడ్డి, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...