నిండుకుండలా..శ్రీశైలం


Mon,September 16, 2019 02:08 AM

-884.5 అడుగుల నీటిమట్టం
-లక్ష క్యూసెక్కులకు పైగా అవుట్‌ఫ్లో
-మూడు గేట్ల ద్వారా సాగర్‌కు నీటి విడుదల

జోగుళాంబ గద్వాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జూరాలకు వదర కొనసాగుతుంది. ఆదివారం సాయంత్రం జూరాల ఇన్‌ఫ్లో 72,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 97,377 క్యూసెక్కులు నమోదైంది. వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండటంతో జూరాలలోని ఏడె గేట్లను ఎత్తి స్పిల్ వే ద్వారా 53,492 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగుల ఎత్తులో 9.657టీఎంసీలుండగా పూర్తిస్థాయి నీటి నిల్వ ఉంచడంతో 9.132 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి కాలువ ద్వారా 815 క్యూసెక్కులు, ఎడ మ కాలువ ద్వారా 1100 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 650 క్యూసెక్కులు నీటిని అధికారులు కాలువల్లోకి విడుదల చేస్తున్నారు.

వీటితోపాటు నది నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్లను నింపేందుకు నెట్టెంపాడు లిఫ్ట్‌లో రెండు మోటార్లను ప్రారంభించి 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2 ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 630 క్యూ సెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 1,13,122 క్యూసెక్కులు కొనసాగుతుండటం తో అవుట్ ఫ్లోను తగ్గించి కేవలం 30,657 క్యూసెక్కుల నీటిని మాత్రమే నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌కు పూర్తి సామర్థ్యం 129.72టీఎంసీలు ఉం డగా 128.01టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. దీంతో నారాయణపురకు వరద ప్రవాహం తగ్గిపోయిందది. ఇన్‌ఫ్లో 45,971 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 30,651 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 36.96 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

నిండుకుండలా శ్రీశైలం
నాగర్‌కర్నూల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో క్రమేణా తగ్గుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి మూడు గేట్ల ద్వారా మాత్రమే నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో రెండోసారి ఐదురోజులుగా జూరాల ప్రాజెక్టు, సుంకేసుల నుంచి శ్రీశైలంకు ఇన్‌ఫ్లోగా వరద వస్తుంది. ఆదివారం నాటికి జూరాల నుంచి 1.12లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా సుంకేసుల ద్వారా 35వేల క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో ప్రాజెక్టు గరిష్ట మట్టం 885అడుగులకు గాను 884.50అడుగులకు చేరగా 215 టీఎంసీలకు గాను 212.9198టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు నిండుకుండలా జలకళను సంతరించుకున్నది.

శ్రీశైలంకు 1,49,655 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా మూడు గేట్లు, పవర్‌హౌస్‌ల ద్వారా అవుట్‌ఫ్లో 1,87,426క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ఆధారితమైన ఎంజీకేఎల్‌ఐకి 3200క్యూసెక్కులు, హంద్రీ నీవాకి 2,026క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 28,500 క్యూసెక్కుల నీళ్లు తరలిపోతున్నాయి. అదేవిధంగా కుడిగట్టు జల విద్యుత్ కేంద్రానికి 29,325 క్యూసెక్కులు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రానికి 40,259క్యూసెక్కుల చొప్పున మొత్తం 1,87,259 క్యూసెక్కుల నీళ్లు బయటికి వెళ్తున్నాయి.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...