ఆలయాలకు పోటెత్తిన భక్తులు


Mon,September 16, 2019 02:03 AM

అలంపూర్,నమస్తే తెలంగాణ : కోటి లింగాలకు కొలువైన అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు ఆదివారం భక్తులు పో టెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ద ర్శనాల కోసం భక్తులు గంటల కొద్ది వేచి ఉండే పరిస్థితి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వ్యాపారులు, ఉద్యోగుల కుటుంబ సమేతంగా ఆలయాలను దర్శించుకున్నారు. స్వామి వారి ఆలయంలో అభిషేకాలు, అమ్మ వారి ఆలయంలో కుంకుమార్చనలు తదితర పూజలు ని ర్వహించారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదా లు అందజేశారు. దేవస్థానం వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిత్యాన్న దాన సత్రంలో భక్తులు మధ్యాహ్నం అన్నప్రసాదాలు స్వీకరించారు. తోచిన కొద్ది తమ శక్తి కొలది భక్తులు నిత్యాన్న దాన సత్రానికి విరాళాలు సమర్పించారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...