అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి


Mon,September 16, 2019 02:03 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పట్టణ అభివృధ్ధిలో భాగంగా చేపడుతున్న రోడ్డు విస్తరణ, బ్రిడ్జిల నిర్మాణంలో వేగం పెంచాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయం లో ఆర్‌అండ్ బీ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మహబూబ్‌నగర్ పట్టణానికి తలమానికంగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ వరకు రోడ్డు విస్తరణను త్వరితగతిన చేపట్టాలని కోరారు. ఇప్పటికే ప్రారంభమైన రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వీటితోపాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న మహబూబ్‌నగర్ పట్టణంలో ట్రాఫిక్ ని యంత్రణలో భాగంగా కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న బ్రిడ్జికి అనుసంధానంగా టీడీ గుట్ట వరకు నూతనంగా ఏర్పాటు చేసే వై జంక్షన్ ప్రతిపాదనలను ఆమోదం తెలిపి, వెంటనే వై జంక్షన్ పనులను ప్రారంభించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆదేశించారు.

ఎప్పటికప్పుడు పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించాలని సూచించారు. పనులు మరింత నాణ్యతగా జరిగేలా చూడాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ప్రభుత్వ లక్ష్యం మేరకు అధికారులు మరింత బాధ్యతగా పని చేయాలని సూ చించారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఈఎన్‌సీ గణపతిరెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...