రెండు రోజుల్లో మినీ ట్యాంక్ బండ్‌కు కృష్ణమ్మ రాక


Mon,September 16, 2019 02:02 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని నల్లచెరువు(మినీ ట్యాంక్ బండ్‌కు) మరో రెండు రోజుల్లో కృష్ణమ్మ జలాలు రానున్నట్లు జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి తెలిపారు. మినీట్యాంకు బం డ్‌కు నీళ్లు వచ్చే కాలువలో పేరుకుపోయి న కంపచెట్లను తొలగిస్తున్న పనులను ఆదివారం టీఆర్‌ఎస్ నాయకులతో పరిశీలించారు. ఈ సందర్భంగా లోకనాథ్‌రె డ్డి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కృషితో జిల్లా కేంద్రానికి కృష్ణా జలాలు వస్తున్నాయన్నారు. గతంలో చుట్టూ కృష్ణా జలాలు పారుతున్నా చుక్క నీరు కూడా జిల్లా కేం ద్రానికి వచ్చిన దాఖలాలు లేవని గుర్తు చేశారు.

గతేడాది మొట్టమొదటి సారిగా జిల్లా కేంద్రానికి కృష్ణా జలాలను తీసుకువచ్చారని, ఈ ఏడాది కూడా నీరు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. వాగులో పేరుకున్న చెత్త, కంపచెట్లను మంత్రి నిరంజన్‌రెడ్డి తన స్వంత ఖర్చులతో తొలగిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రమేశ్‌గౌడ్, మాజీ కౌన్సిలర్లు శ్రీధర్, తిరుమల్ నాయుడు, గోపాల్‌పేట ఎంపీపీ తిరుపతయ్య, నాయకులు రామారావు, మురళీసాగర్, గిరి, విష్ణు, షఫి, రామస్వామి తదితరులు ఉన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...