రోడ్డు బాధితులకు మంత్రి భరోసా


Mon,September 16, 2019 02:02 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : వనపర్తి-కొత్తకోట రోడ్డు విస్తరణలో భాగంగా నాగవరం గ్రామంలో ఇండ్లు కోల్పోతున్న బాధితులకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అండగా ఉన్నారని టీఆర్‌ఎస్ నాయకుడు రవి అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆదివారం రెండో నెల కిరాయిలను మంత్రి తన జీతం నుంచి చెల్లించడం జరిగిందని తెలిపారు. విస్తరణలో సర్వస్వం కోల్పోతున్న వారికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తాయని, అప్పటి వరకు కిరాయిలు చెల్లిస్తానని హామీ ఇచ్చారని, అందులో భాగంగానే గత నెల, ఈ నెల కిరాయిలు చెల్లించడంతో బాధితులు మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు, బాధితులు తదితరులు ఉన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...