ఆరు గేట్ల ద్వారా..నీటి విడుదల


Sun,September 15, 2019 01:12 AM

-శ్రీశైలానికి తగ్గిన ఇన్‌ఫ్లో
-సాగర్‌కు లక్షకుపైగా క్యూసెక్కులు
-కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
-సాగర్‌కు 2.39 లక్షల క్యూసెక్కులు

నాగర్‌కర్నూల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శ్రీశైలం ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో తగ్గింది. ఎగువన జూరాల నుంచి వరద జలాలు తగ్గాయి. దీంతో శుక్రవారం పది గేట్లతో నీటిని విడుదల చేయగా శనివారం నాటికి ఆరు గేట్ల ద్వారా నీటి విడుదల చేపడుతున్నారు. జూరాల నుంచి 1.54 లక్షల క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 44,790, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 34,954 క్యూసెక్కుల చొప్పుల మొత్తం 2,34,605 క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. దీని వల్ల ప్రాజెక్టు గరిష్ట మట్టం 885 అడుగులకు గానూ 884.500 అడుగులకు నీటి గరిష్ట నిల్వ సామార్థ్యం 215 టీఎంసీలకు గానూ 212.91 టీఎంసీలకు చేరింది. ఇక కుడి, ఎడమ గట్టు జలాశయాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఎంజికేఎల్‌ఐ ప్రాజెక్టునకు 2400ల క్యూసెక్కులు, హంద్రీకి 2026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 28,500 క్యూసెక్కులు విడుదల అవుతున్నాయి. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రానికి 42,378 కుడిగట్టు విద్యుత్ కేంద్రానికి 29,861 క్యూసెక్కులు తరలి వెళ్తున్నాయి. ఇక జూరాల నుంచి 17 గేట్ల ద్వారా 1,54,861 క్యూసెక్కుల చొప్పున మొత్తం 1,94,627 క్యూసెక్కుల నీళ్లు వెళ్తున్నాయి. కాగా ఎగువ నుంచి వస్తున్న వరద జలాలు తగ్గడంతో మిగిలిన గేట్లను ఆదివారానికి కూడా మూసివేసే అవకాశం ఉంది.

జూరాలలో 17 గేట్లు ఎత్తిన అధికారులు
జోగుళాంబ గద్వాలజిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జూరాల ప్రాజెక్ట్‌కు స్థిరంగా వదర కొనసాగుతుంది. జూరాల ఇన్‌ఫ్లో 1,97,000 క్యూసెక్కులు, అవుట్ ప్లో 1,94,625 క్యూసెక్కుల నమోదైంది. వరద ప్రవాహానికి అనుగుణంగా 17 గేట్లను ఎత్తి ద్వారా 1,54,861 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నన్నారు. జూరాల ప్రాజెక్ట్ సామర్థ్యం 1045 అడుగుల ఎత్తులో 9.657 టీఎంసీలుండగా ప్రస్తుతం 1044.5 అడుగుల ఎత్తులో 9.029 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి కాలువ ద్వారా 815 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 1,100 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 650 క్యూసెక్కులు నీటిని అధికారులు కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. విద్యుత్పుత్తి కోసం పవర్‌హౌజ్‌కు 34,9 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి 6 టర్బైన్లను ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వీటితో పాటు నది నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్లకు నింపేందుకు నెట్టెంపాడు లిఫ్ట్‌లో 2 మోటర్లను ప్రారంభించి 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2 ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 630 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు.

ఎగువనున్న కర్ణాటకాలో భారీగా వర్షపాతం నమోదవుతుండటంతో అక్కడి ప్రాజెక్ట్‌లకు వరద నీరు క్రమక్రమంగా పెరుగతూ చేరుతుంది. ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 1,60,489 క్యూసెక్కులు కొనసాగుతుండటంతో అవుట్ ఫ్లో 1,65,199 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 129.72 టీఎంసీలుండగా ప్రాజెక్ట్ అధికారులు నదిలో 120.52 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. నారాయణపుర ప్రాజెక్ట్‌లో ఇన్‌ఫ్లో 15,000 క్యూసెక్కులుండగా కేవలం 2 గేట్లను మాత్రమే ఎత్తి 5,800 క్యూసెక్కుల నీటిని మాత్రమే నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ప్రాజెక్ట్‌లో 31.92 టీఎంసీల నీటిని నిల్వ చేసుకొని వచ్చిన నీటిని వచ్చినట్టుగా నదిలోకి విడుదల చేస్తున్నారు.

ఆర్డీఎస్‌కు 26,330 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
అయిజ : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తోడు టీబీ డ్యాం నుంచి విడుదల అవుతున్న వరదతో ఆర్డీఎస్ ఆనకట్టకు నీటి ప్రవాహం కొనసాగుతున్నది. టీబీ డ్యాం నుంచి 22,900 క్యూసెక్కుల వరద విడుదల చేస్తుండటంతో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద నీరు స్థిరంగా చేరుతోంది. శనివారం ఆర్డీఎస్ ఆనకట్టకు 26,330 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, ఆనకట్టపై 30,520 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉంది. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి ఆయకట్టుకు 610 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆర్డీఎస్ డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 10 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు డీఈఈ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని సింధనూరు హెడ్‌రెగ్యులేటర్ సమీపంలో 350 క్యూసెక్కులు ఆయకట్టుకు చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

తుంగభద్రలో 100.855 టీఎంసీల నిల్వ
కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర నదికి వరద కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు అప్పర్ తుంగ నదికి వరద స్థిరంగా కొనసాగుతుండటంతో అప్పర్ తుంగ ప్రాజెక్టు నుంచి వరద నీటిని దిగువన ఉన్న తుంగభద్ర జలాశయానికి విడుదల చేస్తున్నారు. అప్పర్ తుంగ నుంచి 13,564 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. శనివారం తుంగభద్ర జలాశయానికి 35,893 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 22,900 క్యూసెక్కులు నమోదైంది. 10 స్పిల్‌వే గేట్ల ద్వారా 22,900 క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు. కర్ణాటక, ఏపీ రాష్ర్టాలకు చెందిన కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. 100.855 టీఎంసీల నీటి నిల్వకు గాను ప్రస్తుతం 100.855 టీఎంసీలను నిల్వ ఉంచినట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ తెలిపారు. 1633 అడుగుల నీటి మట్టానికి గాను 1633 అడుగుల నీటి నిల్వ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో టీబీ డ్యాంకు వరద మరి కొన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

సుంకేసులకు 20,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
రాజోళి : సుంకేసుల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న శనివారం తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి శనివారం సాయంత్రానికి 20,700 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రాగా, 4 గేట్లను తెరిచిన అధికారులు 17,700 క్యూసెక్కుల దిగువకు వదిలారు. కేసీ కెనాల్‌కు 2,700 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు జేఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...