ప్రగతి పథంలో పల్లెలు


Sun,September 15, 2019 01:10 AM

మదనాపురం : సీఎం కేసీఆర్ పిలుపుమేరకు పల్లెలు ప్రగతి పథంలో దూసుకెల్తున్నాయి. శనివారం ఉమ్మడి మండలాలలోని ఆయా గ్రామాలలో ప్రజాప్రతినిధులు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తకోట మండలం అమడబాకుల గ్రామంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్ జేసీబీతో కంప చెట్లను తొలగించారు. మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామంలో జెడ్పీటీసీ కృష్ణయ్య గొడ్డలి చేతపట్టి ముళ్ల చెట్లను తొలిగించారు. అదేవిధంగా ఉమ్మడి మండలాల్లో ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు అందరూ పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొంటు గ్రామాలలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేసుకొని శుభ్రం చేస్తున్నారు. దోమల నివారణకు గ్రామాల్లో సర్పంచులు యంత్రం ద్వారా దోమల మందు కొట్టిస్తున్నారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ గ్రామాలు శుభ్రం కావాలంటే ప్రజాప్రతినిధులు ముందుకు కదలాలని పిలుపు నిచ్చారు. అప్పుడే ప్రజలంతా స్వచ్ఛందంగా పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. వామన్‌గౌడ్, కృష్ణయ్య పిలుపుమేరకు ఆయా గ్రామాలలో రెండు వందల మంది యువకులు శ్రమదాన కార్యక్రమానికి తరలివచ్చారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి స్వామి, సర్పంచులు పద్మ, బుచ్చన్న, బ్రహ్మమ్మ, ఎంపీటీసీలు రాములు, శేశిరెడ్డి, రాజారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, జయచందర్, శ్రీనివాసులు, శాంతమూర్తి, రవి, రాము, శంకర్, వెంకటేశ్వర్‌రెడ్డి, నాగరాజు, కొల్లంపల్లి, రాజశేఖర్, సైదులు, అంజన్న, సత్యం తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...