రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ


Sun,September 15, 2019 01:10 AM

వనపర్తి విద్యావిభాగం : జిల్లా కేం ద్రంలోని స్వేరోస్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతలపై పట్టణంలో అవగాహన ర్యా లీని నిర్వహించారు. ముందుగా పట్టణ ఎస్సై నరేందర్, స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌లు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వేరోస్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలు నుంచి వచ్చిన 35 బైక్‌లతో ర్యాలీ చేపట్టామని అన్నారు. ఇందులో ప్రధానంగా ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణిం చి, ఇద్దరు కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందేనని, త్రిబుల్ రైడింగ్ చేయోద్దని పేర్కొన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేయవద్దనే నినాదంతో ఈ అవగాహన ర్యాలీని నిర్వహించామన్నారు. కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు సాయిబాబు, అధికార ప్రతినిధి చెన్నయ్య, చైతన్య, రమేశ్, మహిపాల్ తదితరులు ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...