ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి


Sun,September 15, 2019 01:10 AM

ఖిల్లాఘణపురం : గ్రామాలలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని, అందుకు పరిసరాలను పరిశుభ్రతను పాటించాలని మెడికల్ ఆఫీసర్ శంకర్ అన్నారు. శనివారం మండలంలోని ఉప్పర్‌పల్లి గ్రామంలో డాక్టర్ అజయ్‌కుమార్‌తో కలిసి మెడికల్ క్యాంపును నిర్వహించారు. ముందుగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రా మంలో వర్షకాలంలో సీజనల్ వ్యాధులు వస్తాయని అందుకు మనమంతా తగు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. అదేవిధంగా మన ఇంటి చుట్టు ముట్టు ఉన్న పరిసరాలను చెత్త చెదారాన్ని, మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా డెంగీ, మలేరియా, టైపాయిడ్, కలరా తదితర వ్యాధుల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ రమ్య, ప్రేమలీల, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...