రైతు సమగ్రాభివృద్ధే సర్కార్ లక్ష్యం

Sun,September 15, 2019 01:10 AM

పాన్‌గల్ : రైతు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రైతుబంధు, బీమా వంటి అనేక సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని రేమద్దుల, ఏదుట్ల గ్రామాల మధ్య ఉన్న ఎంజీకేఎల్‌ఐ డీ-8 కాలువ నుంచి వెళ్లే మేజర్ కెనాల్-3 కాలువ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంజే-3 పనులను త్వరితగతిన పూర్తి చేసి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తి చేస్తే రైతులకు సాగునీరు అందే అవకాశం ఉందని తెలిపారు. కాల్వల నిర్మాణానికి రైతులు సహకరించాలని, భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని పేర్కొన్నారు. అనంతరం రేమద్దుల గ్రామానికి చెందిన వెంకట్రావమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బీరం పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, ఎంపీటీసీ కర్ణాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు వెంకటయ్యనాయుడు, తిరుపతయ్య, రవి, యాదగిరి ఆచారి తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...