అందుబాటులో..యూరియా


Sat,September 14, 2019 03:55 AM

-రైతు సంక్షేమమే ధ్యేయం
-గుమ్మడంలో పీహెచ్‌సీ ఏర్పాటుకు కృషి
-వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
-నూతన సబ్‌స్టేషన్, అంగన్‌వాడీల నిర్మాణాలకు శంకుస్థాపన

ఖిల్లాఘణపురం : రైతులందరికీ యూరియా అందుబాటులో ఉందని, సరఫరా చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని మానాజిపేట గ్రామంలో నూతన 33/11 కేవీ సబ్‌స్టేషన్, అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ యాసంగిలోగా సబ్‌స్టషన్ ని ర్మాణ పనులు పూర్తిచేసి రైతులకు లో ఓల్టేజీ సమస్యలు రాకుండా నిరంతర విద్యుత్‌ను సరఫరా చే స్తామన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభు త్వం ముందుకు సాగుతుందన్నారు. ఉచిత విద్యుత్‌ను అందించేందుకు అవసరం ఉన్న చోట సబ్‌స్టేషన్ నిర్మాణాలను ఏర్పాటు చేస్తున్నామని చె ప్పారు. మానాజిపేట గ్రామంలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి మొదటి విడతగా రూ.కోటి73లక్షలు, రూ. 27 లక్షలు కంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రభు త్వం మంజూరు చేసిందన్నారు. సబ్‌స్టేషన్ నిర్మా ణం పూర్తయితే చుట్టుపక్కల గ్రామాల రైతులకు కూడా 24 గంటల విద్యుత్ సరఫరా అందుతుందన్నారు. 60 నుంచి 70 రోజుల్లో రాత్రి పగలు పనిచేయాలని గుత్తేదారులకు సూచించారు.

ప్రత్యేక మోటర్ల ద్వారా సాగునీరు..
ఘణపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా మండలం లో మిగిలిపోయిన షాపూర్, మానాజిపేట గ్రామాలకు సాగునీరు చేరాలంటే కాలువ పనులు పూర్తిచేయాల్సి ఉంటుందని, అటవీ ప్రాంతంలో పను లు ఉన్నందువల్ల సాంకేతిక కారణాలు తలెత్తుతున్నాయని మంత్రి తెలిపారు. 25 రోజుల్లో పనులు పూర్తిచేసి రెండు గ్రామాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పనులు పూర్త య్యే వరకు అండర్‌టన్నెల్ పనులు పూర్తిచేసి అక్క డి నుంచి రెండు 50హెచ్‌పీ మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తామని తెలిపారు. సోలీపూర్ పెద్ద చెరువు నుంచి సూరాయపల్లి, ఉప్పర్‌పల్లి గ్రామాలకు కూ డా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యేకు ప్రభుత్వం అందించే బడ్జెట్‌లో ప్రతి పైసాను రైతుల అభివృద్ధి కోసమే ఉపయోగిస్తానని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు యూరియాను అందించడమే లక్ష్యంగా ప్రభు త్వం పనిచేస్తుందని చెప్పారు. విశాఖపట్నం దగ్గరలో ఉన్న ఓడరేవు వద్దకు వెళ్లి అక్కడ నిల్వ ఉన్న యూరియాను త్వరితగతిన తెలంగాణకు పంపించాలని అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. అనంతరం 35 మంది దరఖాస్తు చేస్తున్న కల్యాణలక్ష్మీ పత్రాను పరిశీలించి వాటిపై సంతకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, జె డ్పీటీసీ సామ్యనాయక్, సర్పంచులు సతీశ్, వెంకటరమణ, ఎంపీటీసీలు నాగయ్య, ఆశాజ్యోతి, టీ ఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు లకా్ష్మరెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ వెంకట్రావ్ పాల్గొన్నారు.

గుమ్మడంలో పీహెచ్‌సీ ఏర్పాటుకు కృషి..
పెబ్బేరు రూరల్ మండలంలోని గుమ్మడం గ్రామంలో పీహెచ్‌సీ మంజూరుకు కృషి చేస్తానని మంత్రి నిరంజన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. గ్రామం లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న 33/11 విద్యు త్ సబ్‌స్టేషన్, అంగన్‌వాడీ, యాదవ సంఘం భ వనాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమర్థవంతమైన ఏజెన్సీకి పనులు అప్పజెప్పి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. వా రంలో టెండర్లు పూర్తి చేసి, రెండు నెలల్లో పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అ నంతరం బొక్కలమ్మకు సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన రూ.23 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శైలజ, జెడ్పీటీసీ పద్మ, సర్పంచ్ సువర్ణ, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు హ రిశంకర్‌నాయుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుచ్చారెడ్డి, మాజీ జెడ్పీటీసీ కర్రెస్వామి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు శ్రీనివాసరె డ్డి, నాయకులు ఆంజనేయులుసాగర్, సత్యారెడ్డి, చెన్నయ్య, పాపన్న, ఆంజనేయులు, కురుమూర్తి, వెంకటేశ్, రవి, బాల్‌రాం తదితరులున్నారు.

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ..
వనపర్తి, నమస్తే తెలంగాణ : అనారోగ్యంతో బాధపడి వైద్యం చేయించుకున్న బాధితులకు వి డుదలైన సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి నిరంజన్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని తన నివాసగృహంలో మంత్రి నిరంజన్‌రెడ్డి పంపిణీ చేశారు. పె బ్బేరుకు చెందిన అమర్‌నాథ్‌కు రూ.1,50,000 ఎల్‌వోసీ, తోమాలపల్లికి చెందిన కురుమన్నకు రూ.19వేలు, జంగయామపల్లికి చెందిన సేవ్యానాయక్ రూ.7,500, గోపాల్‌పేటకు రా ధాకృష్ణకు రూ.12,500, తొగియా నాయక్‌కు రూ.17,500, ఏదుట్లకు చెందిన లక్ష్మికి రూ. 12,500 చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమం లో మున్సిపల్ మాజి చైర్మన్ రమేశ్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు గట్టుయాదవ్ తదితరులు ఉన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...