బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలో అధికారుల తనిఖీలు


Sat,September 14, 2019 03:52 AM

వనపర్తి రూరల్ : మండలంలోని చిట్యాల, శ్రీనివాసుపురం గ్రామాలలోని బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని శుక్రవారం సివిల్ సప్లయి జిల్లా అధికారి రేవతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారిణి రేవతి బాలుర మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అలాగే చిట్యాలలో బాలుర మహత్మాజ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో డీ ఎం లక్ష్మయ్య పాఠశాల ప్రిన్సిపాల్ వెం కటేశ్వర్‌రెడ్డి కలిసి పాఠశాల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు సన్న బియ్యం భోజనం అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...