సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి


Sat,September 14, 2019 03:52 AM

పెద్దమందడి : మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డాక్టర్ పరిమళ అన్నారు. శుక్రవారం మండలంలోని అల్వా ల గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించా రు. ముందుగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షకాలంలో సీజనల్ వ్యాధులు వస్తాయని అందుకు మనమంతా తగు జాగ్రత్తలు పాటిస్తే వాటి నుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. నీటి నిల్వలోనే దొమ లు అభివృద్ధి చెందుతాయని కావున ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సువర్ణమ్మ, ఉప సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, సూపర్‌వైజర్ ఓంప్రకాశ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...