మెనూ ప్రకారం భోజనం అందించాలి


Sat,September 14, 2019 03:52 AM

ఖిల్లాఘణపురం : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి అన్నారు. మండలంలోని దొంటికుంటతండా సమీపంలో ఉన్న ఆదర్శ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందజేస్తున్న భోజనం సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకుంటారని వారికి నాణ్యవంతమైన విద్యను అందించి వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలోని సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దొంటికుంటతండా, రుక్కన్నపల్లి గ్రామా లో పర్యటించి గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణనాయక్, జెడ్పీటీసీ సామ్యనాయక్, సర్పంచ్ పీనానాయక్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...