వినియోగదారుల చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి


Sat,September 14, 2019 03:52 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : ప్రజలకు అందుబాటు కోసం ఏర్పాటు చేసిన వినియోగదారుల చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, వినియోగదారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే హక్కులు ఈ వినియోగదారుల చట్టం ద్వారా కల్పించడం జరిగిందని ఆయన వివరించారు. అమ్మకాలు, వ్యాపారస్థులు, ఉత్పత్తి దారులు ఎప్పటికప్పుడు వినియోగదారులను మోసిగించడానికి సిద్ధంగా ఉంటారని, వస్తువులను కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు వహిస్తూ, ప్రతి కొనుగోలుకు రశీదును విధిగా తీసుకోవాలన్నారు. వినియోగదారులకు వ్యక్తిగతంగా నష్టం లేకుండా, శారీరకంగా, మానసికంగా నష్టం కలిగించే వస్తువులను వినియోగదారుడు కొనుగోలు చేయరాదన్నారు. ఈ సమావేశంలో డీఎస్‌వో రేవతి, డీఎస్‌వో డీఎం మల్లిఖారన్జున్, డీసీజేసీ కన్వీనర్ శిరుసాల, సీఎస్ దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...