క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాల అధిరోహణ


Sat,September 14, 2019 03:51 AM

వనపర్తి విద్యావిభాగం : విద్యార్థులు చక్కని క్రమశిక్షణ, లక్ష్యాలను ఎంపిక చేసుకొని వాటి సాకారం కోసం ఆచరణలతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జూనియర్ బాలికల కళాశాల ప్రిన్సిపాల్ కౌసర్ జహాన్, ప్రిన్సిపాల్ మద్దిలేటి, జాకీర్ హుస్సేన్‌లు అన్నారు. శుక్రవారం ఎంబీ గార్డెన్‌లో బాలికల జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సర విద్యార్థులకు ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కౌమరదశలో నిర్ణయాలు తీసుకోవడంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారని, ఆకర్షణకు లోనవుతారని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటు శ్రద్ధతో చదువును కొనసాగించాలన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికబద్దంగా ఉన్నత శిఖరాలను అధిరోహించి కళాశాలకు, కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని వారు సూచించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఆట, పాట పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...