జిల్లాస్థాయి స్పార్క్ ఫెస్టివల్‌కు ఎంపికైన విద్యార్థులు


Sat,September 14, 2019 03:51 AM

వనపర్తి విద్యావిభాగం : తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి స్పార్క్ ఫెస్టివల్‌లో వనపర్తి మైనార్టీ గురుకుల విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ జూనియర్ కళాశాలలో వనపర్తి జిల్లాలోని నాలుగు మైనార్టీ గురుకుల విద్యార్థులకు ఉపన్యాసం, వ్యాసరచన, చర్చ, చిత్రలేఖనం, పాటలు, నాటకాలు, సెల్పీ వంటి విభాగాలలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఆయా రంగాలలో ప్రతిభ కనబర్చి జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రాంతీయ సమన్వయ అధికారి గులాం హుస్సెన్ హాజరై మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాలను వెలికితీసేందుకోసమే ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, చదువుతో పాటు సాంస్కృతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లాస్థాయి స్పార్క్ ఫెస్టివల్ దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జనార్దన్‌గౌడ్, బాలుర, బాలికల ప్రిన్సిపాల్స్ నరేశ్, విజితరెడ్డి, బాలకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...