బై..బై.. గణేశా


Fri,September 13, 2019 03:55 AM

-ఘనంగా గణనాథుల నిమజ్జనయాత్ర
-జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా సాగిన ఊరేగింపు
-యువకుల నృత్యాలు, మహిళల కోలాటాలు, బొడ్డెమ్మలు
-డప్పుల దరువులతో గంగమ్మ ఒడికి చేరిన లంబోదరుడు

ఏకదంతుడా.. మమ్మేలగ రావయ్యా అంటూ జిల్లా కేంద్రంలో 11 రోజు ల పాటు పూజలందుకున్న గణనాథులను ఘనంగా గంగమ్మ ఒడికి చేర్చారు. దారి పొడవునా డప్పుల దరువులు, యువకుల నృత్యాలు, మహిళల కోలాటాలు, బొడ్డెమ్మలతో ఏకదంతుని సాగనంపారు. ప్రత్యేక అలంకరణ చేసిన వాహనాల్లో గణపతిని వీధులలో ఊరేగించి పట్టణ సమీపంలోని అమ్మచెరువులో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయసంఘటనలు జరగకుండా పోలీస్‌లు భద్రత చర్యలు చేపట్టారు.
- వనపర్తి సాంస్కృతికం

వనపర్తి సాంస్కృతికం: జిల్లా కేంద్రంలో ఆయా వీధు ల్లో 11 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను గురువారం నిమజ్జనానికి తరలించారు. పట్టణంలోని గాంధీనగర్, బండార్‌నగర్ యువకులు మండపాల వద్ద భక్తులకు అన్నదానం చేశారు. వినాయకుడి నిమజ్జనం కోసం అందంగా అలంకరించిన వాహనాలపై గణనాథులను ఏర్పాటు చేశారు. యు వకులు, చిన్నారులు నృత్యాలు, మహిళలు బొడ్డెమ్మలు, కోలాటాలు వేస్తూ గణనాథులను ఊరేగించారు. జిల్లా కేంద్రంలో ఇండియన్ యూత్ మండపంలో వినాయకుడి లడ్డూ రూ.41,516లకు కోమరి రాజు వేలం పాటలో దక్కించుకున్నారు. శ్రీ రామ యువసేన, ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ యూ త్ వినాయక మండపాల వద్ద లడ్డూ వేలం పాట నిర్వహించారు. పట్టణంలో వీధులన్నీ వినాయకుల శోభాయాత్రతో కళకళలాడాయి. నిమజ్జన యాత్ర ను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలొచ్చారు. పట్టణ సమీపంలోని అమ్మ చెరువుకు నిమజ్జనానికి పదుల సంఖ్యలో గణేశ్ విగ్రహాలు తరలిరావడంతో సందడిగా నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...