కదిలిన పల్లెలు


Fri,September 13, 2019 03:52 AM

-చురుకుగా పారిశుధ్య పనులు
-రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించండి
-కలెక్టర్ శ్వేతామొహంతి
-ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
-జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ శ్వేతామొహంతి సూచించారు. గురువారం ఆత్మకూరు మండలంలోని బాలకిష్టాపూర్, అమరచింత మండలంలోని పాంరెడ్డిపల్లి గ్రామాలలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆయా గ్రామాలలో పర్యటిస్తూ రోడ్లు, మురికి కాలు వలు, నల్లాలను పరిశీలించారు. రోడ్ల పక్కన చెత్తకుప్పలు, మిషన్ భగీరథ నీరు రోడ్లపై వృథాగా పోవడాన్ని చూసిన కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే దేశం బాగుంటుందని, ఇందుకోసం పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని కోరారు. రోడ్లపై చెత్తవేసే వారిని గుర్తించి రూ.500 జరిమానా వేయాలన్నారు. రెండోసారి తప్పు చేసిన వారికి జరిమానా విధించేలా గ్రామ కమిటీ తీర్మానిం చాలన్నారు. ఇందులో బంధుప్రీతికి తావులేకుండా చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటికి సంబంధించిన అధికారులు సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాలను హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని మొక్కలు నాటారు.

అనంతరం జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ పారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామం ఏ ఒక్కరితోనే అభివృద్ధి కాదని, ప్రజలు భాగస్వాములైతేనే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ బంగా రు శ్రీనివాసులు, సర్పంచ్ తుకారాంనాయక్ గ్రామ అభివృద్ధికి సిద్ధం చేసిన ప్రణాళికను కలెక్టర్, జెడ్పీ చైర్మన్లకు అందజేశారు. 30 రోజుల కార్యచరణలో అన్ని సమస్యలను పరిష్కరించే లా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో నరసింహులు, డీపీవో రాజేశ్వరి, తాసిల్దార్లు జేకే మోహన్, జీ కల్యాణి, ఎంపీడీవోలు శ్రీపాద్, రఘునాథ్‌రెడ్డి, ఎంపీపీలు బంగారు శ్రీనివాసులు, మాలతి, జెడ్పీటీసీ సరోజ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

-ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి : ఎంపీపీ
వనపర్తి రూరల్ : మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీని 30 రోజుల ప్రణాళికలో భాగంగా ప్లాస్టిక్ రహి త గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు స్థాయీ సంఘం సభ్యులు కృషి చేయాలని ఎంపీపీ కిచ్చారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దగూడెం గ్రామంలో నిర్వహించిన ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామ పంచాయితీ సర్పంచుతో పాటు ప్రతి ఒక్కరు గ్రామా భివృద్ధిలో పాలు పంచుకోవాలన్నారు. పీఎస్ పాఠ శాల ప్రధానోపాధ్యాయుడు జితేందర్‌తో కలిసి పాఠ శాల మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరి శీలించారు. అంగన్‌వాడీలో టీచర్ లేకుండా కేవలం ఆయాలు మాత్రమే ఉండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ముళ్ల కంపను తొలిగించడం, మురికి కాల్వలు శుభ్రం చేయించారు.

రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటించారు. మండలంలోని చి ట్యాల, కడుకుంట్ల, సవాయిగూడెం, నాచహళ్లీ, దత్తాయిపల్లి, మెంటపల్లి, ఖాశీంనగర్, అప్పయిపల్లి, అం కూర్, చిమనగుంటపల్లి, అచ్చుతాపురం, రాజపేట తదితర గ్రామ పంచాయతీలలో సర్పంచులు, ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులు, స్థాయీ సంఘం సభ్యులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామ అభివృద్ధి కోసం కలిసి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కొండ య్య, ఉప సర్పంచ్ భాస్కర్‌గౌడ్, ప్రత్యేక అధికారి ఎం పీడీవో రఘునాథ్‌రెడ్డి, ఐకేపీ అధికారి ఏపీఎం బుచ్చ న్న, గ్రామ నాయకులు భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...