శ్రీశైలం @ 884 అడుగులు


Fri,September 13, 2019 03:51 AM

-జూరాల నుంచి తగ్గిన వరద
-శ్రీశైలండ్యాంకు 1.97లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
-రెండు గేట్ల ద్వారా సాగర్‌కు నీటివిడుదల
-రెండు గేట్ల ద్వారా సాగర్‌కు 55 వేల క్యూసెక్కులు

నాగర్‌కర్నూల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో తగ్గుతూ వస్తోంది. గత నాలుగైదు రోజుల నుంచి ఎగువన జూరాల నుంచి వస్తున్న నీళ్లతో శ్రీశైలం ప్రాజెక్టు తిరిగి జల కళను సంతరించుకుంది. అయితే గురువారం నుంచి నీటి జోరు తగ్గింది. ఫలితంగా ప్రాజెక్టు ద్వారా సాగర్‌కు కూడా నీటి విడుదల తగ్గింది. గురువారం సాయంత్రం నాటికి జూరాల నుంచి 1,98,685 క్యూసెక్కుల నీళ్లు వస్తుండగా సుంకేసుల నుంచి 63,630 క్యూసెక్కుల నీళ్లు కలిపి మొత్తం 2,62,315 క్యూసెక్కుల నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తున్నాయి. దీనివల్ల ప్రాజెక్టు గరిష్ట మట్టం 885 అడుగులకు గానూ 884 .400 అడుగులకు చేరింది. నీటి మట్టం 215 టీఎంసీలకు గానూ 212.4385 టీఎంసీలకు చేరుకొంది. ఇక ప్రాజెక్టుకు భారీగా వస్తున్న నీళ్లతో కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు. ఫలితంగా కుడిగట్టు కేంద్రానికి 29,517 క్యూసెక్కులు, ఎడమగట్టు కేంద్రానికి 42,378 క్యూసెక్కుల నీళ్లు ఔట్ ఫ్లోగా వెళ్తున్నాయి. అలాగే హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీకి 28,500 క్యూసెక్కులు, ఎంజీకేఎల్‌ఐకి 2400 క్యూసెక్కులు, నాగార్జున సాగర్‌కు రెండు గేట్ల ద్వారా కేవలం 55,600 క్యూసెక్కుల చొప్పున మొత్తం 1,60,421 క్యూసెక్కుల నీళ్లు ఔట్ ఫ్లో రూపంలో వెళ్తున్నాయి. బుధవారం నాటితో పోలిస్తే సగానికి సగం తగ్గడం గమనార్హం.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...