జలశక్తి అభియాన్ పనులను వేగవంతం చేయండి


Thu,September 12, 2019 04:13 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : జలశక్తి అభియాన్ పనులను వేగంవతం చేయాలని కలెక్టర్ శ్వేతామొహంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో జలశక్తి అభియాన్‌పై గోపాల్‌పేట మండల అధికారులు, ఏపీడీ కృష్ణయ్యతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం, పాఠశాలల్లో రూప్ టాప్ వాన నీటి సంరక్షణ కట్టడాలు. చెరువుల పునరుద్ధరణ, వాటర్‌షెడ్ కార్యక్రమాలు, బోర్లలో భూగర్భజలాల పెంపు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ముఖ్యంగా ప్రజలకు జలశక్తి అభియాన్ కార్యక్రమాలపై ఐసీసీ కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఇప్పటివరకు 659 పూర్తి చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. వాన నీటి సంరక్షణ కట్టడాలు, కందకాలు, ఇంకుడు గుంతల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీ కృష్ణయ్య, తాసిల్దార్ రాధాకృష్ణ, జూనియర్ ఇంజినీర్ భాస్కర్, వ్యవసాయ శాఖ ఏడీ హైమావతి తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...