అభివృద్ధికి సహకరించండి


Thu,September 12, 2019 04:13 AM

మదనాపురం (కొత్తకోట) : అభివృద్ధికి అందరూ స హకరించాలని, సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కైనా సరే శంకరసముద్రం నిర్వాసితులను ఆదుకుంటానని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలోని ప్రొఫెసర్ జయశంకర్ స మావేశ మందిరంలో కానాయపల్లి గ్రామస్తులతో ఎమ్మె ల్యే ఆల, కలెక్టర్ శ్వేతామొహంతి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న శంకర్‌సముద్రం రిజర్వాయర్ పూర్తి కావాలంటే బండ్‌లో అడ్డుగా ఉన్న 390 ఇండ్లు తొలగించాలన్నారు. గ్రామ సమస్యలన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో మంగళవారం రాత్రి కలెక్టర్‌తో దాదాపు రెండు గంటలు సమావేశమయ్యానని చె ప్పారు. ఇందుకు కలెక్టర్ కూడా సానుకూలంగా స్పం దించారని తెలిపారు. నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకే కలెక్టర్‌తో కలిసి ఇక్కడ సమావేశమయ్యానన్నారు.

అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ పలు డిమాండ్లను తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి ప్లాట్లు, (ఆర్‌అండ్‌ఆర్) బెనిఫిట్స్ ఇవ్వాలని, సోఫియో ఎకనామిక్ సర్వే ఆధారంగా 95 మందికి మాత్రమే ప్లాట్లు కేటాయించరని, వారికి బెనిఫిట్స్‌లో కేవలం రూ.5 వేలు మాత్రమే (సీ ఫామ్) రవాణా ఖర్చుల నిమిత్తం కేటాయించారని, వారందరికి పూర్తి బెనిఫిట్స్ వర్తింపజేయాలని రై తులు కోరారని చెప్పారు. నిర్వాసితులందరికీ సమానంగా సీ ఫామ్ డబ్బులు రూ.5 లక్షలు ఇవ్వాలని కోరగా జీవో ప్రకారం ఇవ్వడానికి కుదరదని చెప్పామన్నారు. డబు ల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేయాలని కోరగా అది సాధ్యపడదని, ఇదివరకే వారికి ఇండ్ల స్థలా లు మంజూరు చేసినట్లు తెలిపారు.

సోషియో ఎకనామీ సర్వేలో అధికారుల తప్పి దం వల్ల మిస్సయిన 35 మంది నిర్వాసితుల పేర్లను రీ సర్వే చేయించి వారికి కూడా బెనిఫిట్స్ వర్తింపచేయాలని కోరగా తాను, కలెక్టర్ ఉన్నామని తెలిపారు. సోమవారం నుంచి కానాయపల్లి గ్రామం లో ఇంటింటికీ తిరిగి 18 ఏళ్లు నిండిన వారి జాబితాను అధికారులు తయారు చే స్తారని పేర్కొన్నారు. సర్వే తరువాత రిపోర్టును ప్రభుత్వానికి పంపుతామని, ప్ర భుత్వం క్యాబినెట్‌లో అప్రూ వ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చాలా సానుకూలంగా ఉన్నారన్నారు. గ్రామస్తులంతా సహకరిస్తే మూడు నెలల్లో రిజర్యాయర్ పనులు పూర్తిచేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు కలెక్టర్ శ్వేతామొహంతితో కలిసి ఎమ్మెల్యే ఆల రిబ్బన్ కట్‌చేసి ఎంపీపీ చాంబర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీవో చంద్రారెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీ మౌనిక, సింగిల్‌విండో అధ్యక్షుడు సురేంద్రనాథ్‌రెడ్డి, అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, కానాయపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...