యూరియా కొరత లేదు


Wed,September 11, 2019 01:17 AM

మహబూబ్‌ నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మహబూబ్‌నగర్‌ జిల్లాలో యూరియా కొరత లేదని రైతులకు అవసరమైన మేరకు యూరియా సి ద్ధంగా ఉందని జిల్లా వ్యవసాయాధికారి సుచరిత ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. జిల్లాలోని 14 మం డలాల పరిధిలోనూ అన్ని చోట్ల యూరియా రైతులకు అందుబాటులో ఉంచామని ఆమె వివరించారు. ఇవా ళ, రేపు మరో రెండు రేక్‌ (రైల్వే వ్యాగన్లు) యూరి యా లోడు జిల్లాకు వస్తుందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌ వద్ద 1100 మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఆమె వెల్లడించా రు. డీలర్ల వద్ద 70 మెట్రిక్‌ టన్నులు, సొసైటీల వ్ద 87 మెట్రిక్‌ టన్నులు, ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాల వద్ద 90 మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉం దని సుచరిత తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లాలో యూరియా సరఫరా చేస్తున్నామన్నారు. ఏ ఏడాది జిల్లాలో ఒక్క రైతు కూడా యూ రియా అందలేదనే ఫిర్యాదు చేయలేదని వివరించా రు. కావాలని కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు యూరియాను ఎమ్మార్పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. బుధవారం జిల్లాకు ఓ రేక్‌ వస్తోందని అందులో మన జిల్లాకు 400 మెట్రిక్‌ టన్నుల స్పిక్‌ యూరియా కేటాయించారని ఆమె తెలిపారు. గురువారం వచ్చే మరో రేక్‌లో సైతం 400 మెట్రిక్‌ టన్నుల కోరమండల్‌ యూరి యా మన వాటాగా వస్తుందన్నారు. రైతులకు ఎలాం టి ఇబ్బంది లేకుండా యూరియాను అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంపై ప్ర త్యేక దృష్టి సారించిందన్నారు. మహబూబ్‌ నగర్‌ జి ల్లాలో ఈ ఏడాది యూరియా కోసం రైతులకు ఎలాం టి ఇబ్బంది కలుగలేదని ఆమె వివరించారు.

బ్లాక్‌లో విక్రయిస్తే చర్యలు తప్పవు
యూరియా అందుబాటులో లేదని రైతుల ను మోసం చేస్తూ బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి సుచరిత హెచ్చరించారు. జిల్లాలో దేవరకద్ర, నాగారం, గండీడ్‌, మిడ్జిల్‌, పోల్కంపల్లి, అడ్డాకుల, మహబూబ్‌ నగర్‌ డీసీఎంస్‌ సొసైటీలలో 87 మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. జిల్లాలోని 11 ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాల వద్ద 90 మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. డీలర్ల వద్ద సైతం 70 మెట్రిక్‌ టన్నుల యూరి యా ఉందని వివరించారు. దీనికి తోడు మరో 800 మెట్రిక్‌ టన్నుల యూరియా వస్తుందన్నారు. ఇదీ సరిపోని పరిస్థితి వస్తే మార్క్‌ఫెడ్‌ వద్ద ఉన్న బఫర్‌ స్టాక్‌ నుంచి అవసరమైన మేర యూరియా తీసుకోవచ్చన్నారు. ఇవాళ, రేపు వచ్చే యూరియాను 50 శాతం మార్క్‌ఫెడ్‌కు, 50శాతం డీలర్లకు అందిస్తామన్నారు. మార్క్‌ ఫెడ్‌ ద్వారా సొసైటీలు, ఆగ్రోస్‌ రైతు సేవా కేం ద్రాలకు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. రైతులు యూరియా కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి సూచించారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...