రచనలతో చైతన్యం నింపిన కాళోజీ


Tue,September 10, 2019 03:14 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : తెలంగాణ కోసం తన రచనల ద్వారా ప్రజల్లో చైత న్యం నింపిన మహాకవి కాళోజి నారాయణరా వు అని కలెక్టర్ శ్వేతామొహంతి అన్నారు. కాళోజి నారాయణరా వు జయంతిని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాళోజి నారాయణ రావు కవి మాత్రమే కాదని, స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ కోసం కృషి చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ప్రజల మనిషిగా తన కవిత్వంతో కాంక్షను రగిలించి, రాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తి నింపాడన్నారు. కార్యక్రమంలో జేసీ వేణుగోపాల్, ఇన్‌చార్జి డీఆర్‌వో వెంకటయ్య, డీపీఆర్‌వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలాగే ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అపూర్వరావు నివాళి అర్పించారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...