జిల్లాలో యూరియా కొరత లేదు : కలెక్టర్


Tue,September 10, 2019 03:14 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : జిల్లాలో యూరియా కొరత లేద ని కలెక్టర్ శ్వేతామొహంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో యూరియా నిల్వలపై వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వానాకాలం నాటికి 80,721 హె క్టార్లలో పంట సాగు చేయగా, అత్యధికంగా 44,306 హెక్టార్లలో వరి, 6,403 హెక్టార్లలో మొక్కజొన్న, 9840 హెక్టార్లలో కంది, 5242 హెక్టార్లలో ఆముదం, 2825 హెకార్టులలో పత్తి సాగు చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు వివరించారు. వానాకాలం పంటకు జిల్లాకు 17,501 మెట్రిక్‌టన్నులు అవసరం కాగా, ఇప్పటి వరకు 9,288 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని, ఇందులో 7,781 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు వినియోగించగా, మిగిలిన 1,509 మెట్రిక్ టన్నుల యూరియా డీలర్లు, సహాయ సహకార సంస్థల వద్ద నిల్వ ఉందని, ఇవే కాకుండా మార్క్‌ఫెడ్, వనపర్తి బఫర్ నిల్వలు 794 మెట్రిక్ టన్నులు నిలువ ఉందని అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూతెలంగాణ మార్క్‌ఫెడ్, డీలర్ల వద్ద 2,360 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నవని, వానాకాలం పంటకు మొత్తం 17,501 మెట్రిక్ టన్నులకు గాను మిగిలిన 5,850 మెట్రిక్ టన్నులలో సెప్టెంబర్ మాసానికి 3,500, అక్టోబర్ మాసానికి 2,380 మెట్రిక్ టన్నులు జిల్లాకు కేటాయించాలని ప్రభుత్వానికి కలెక్టర్ కోరారు. సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి నాగిరెడ్డి, వ్యవసాయ సాంకేతిక అధికారి హైమావతి తదితరులు పాల్గొన్నారు.

17
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...