ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ


Tue,September 10, 2019 03:13 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి కార్యక్రమానికి 109 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ శ్వేతామొహంతి తెలిపారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కారం విషయంలో ఎవ రూ అశ్రద్ధ వహించరాదని, బాధితులకు న్యాయం చేసే దిశగా పనిచేయాలని అధికారుల కు సూచించారు. కార్యక్రమంలో జేసీ వేణుగోపాల్, ఇన్‌చార్జి డీఆర్‌వో వెంకటయ్య, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులున్నారు. ప్రజావాణికి వచ్చిన వినతుల్లో కొన్ని ఇలా..
పెబ్బేరు మండలంలోని గుమ్మడం గ్రామానికి చెందిన చెన్నయ్య తండ్రి మణికొండ సర్వే నెంబర్ 134లోని 30 గుంటల భూమిని 1994 సంవత్సరంలో పంపిణీ చేసి లవాణి పట్టా చేశాడు. కాగా, అట్టి భూమిని రైతు దానయ్య కబ్జా చేశాడని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు చెన్నయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.మదనాపురం మండలంలోని దంగనూర్, అగ్రహారం గ్రామాలకు సాగు నీటిని అందజేయాలని రెండు గ్రామాల రైతులు కలెక్టర్‌కు వినతి అందజేశారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...