కోటిలింగేశ్వర ఆలయంలో లక్ష పుష్పార్చన


Tue,September 10, 2019 03:13 AM

మదనాపురం (కొత్తకోట) : కొత్తకోట మండలంలోని కానాయపల్లి శివారులో ఉన్న కోటి లింగేశ్వర ఆలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా సోమవారం ఆలయ నిర్వాహకులు సిద్ది, బుద్ది సమేతంగా వెలసిన కోటిలింగ గణపతికి లక్షపుష్పార్చన నిర్వహించారు. ఎంపీపీ మౌనిక హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలోని శివాలయం వీధిలో వెలిసిన వినాయక మండపం వద్ద శివకుమార్ దంపతులు, మదనాపురం బీసీ కమ్యూనిటీ హాల్ ఆవరణలో భక్తులు అన్నదానం చేశారు. కొత్తకోట రచ్చకట్ట ఆవరణలో, మదనాపురం మార్కెట్‌యార్డు సమీపంలో భక్తులు వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలుచేసి తమ భక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చెన్నకేశవరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ కొండారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు మహదేవన్‌గౌడ్, టీఆర్‌ఎస్వీ జిల్లా నాయకులు శ్రీనూజీ, రవికుమార్, శ్రీనివాస్, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...